https://oktelugu.com/

Rohit Sharma: బంగ్లా తో సిరీస్ మొదలే కాలేదు.. అప్పుడే రోహిత్ శర్మ శివతాండవం చేశాడు.. ఈ రేంజ్ ఏ అభిమానీ ఊహించి ఉండడు..

తనదైన రోజే కాదు.. తనది కాని రోజు కూడా రోహిత్ శర్మ ఆడతాడు. ఎలాంటి స్థితిలోనైనా బ్యాటింగ్ చేస్తాడు. ఎంతటి బౌలర్ కైనా చుక్కలు చూపిస్తాడు. తన బ్యాట్ తో శివతాండవం చేస్తాడు.. అందుకే రోహిత్ శర్మను టీమిండియా పాలిట హిట్ మ్యాన్ అని పిలుస్తుంటారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 12, 2024 / 08:29 AM IST

    Rohit Sharma(2)

    Follow us on

    Rohit Sharma: త్వరలో టీమిండియా బంగ్లాదేశ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ఆడనుంది. స్వదేశం వేదికగా ఈ సిరీస్ జరగనుంది. సెప్టెంబర్ 19 నుంచి చెన్నై వేదికగా మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది. రోహిత్ ఆధ్వర్యంలో జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. అయితే ఈ లోగానే టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలనం సృష్టించాడు. సిరీస్ ప్రారంభం కాకముందే దుమ్మురేపాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్ లో రోహిత్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని.. ఐదవ స్థానానికి ఎగబాకాడు. ఇక ప్రస్తుతం అటు వన్డే, ఇటు టెస్ట్ ర్యాంకింగ్స్ లో టాప్ -5 లో కొనసాగుతున్న ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మనే. రోహిత్ తర్వాత యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ ఒక్కో స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నారు. శ్రీలంక పై ఇటీవల రెండు సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ ఆటగాడు రూట్ బ్యాటర్ గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక మూడవ టెస్టులో ఇంగ్లాండ్ పై శ్రీలంక అద్భుత విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన నిస్సాంక.. 42వ స్థానం నుంచి 39వ స్థానానికి చేరుకున్నాడు. ఇక న్యూజిలాండ్ బ్యాటర్ కు కేన్ విలియంసన్, మిచెల్ వరుసగా రెండు మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ ఫోర్త్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు.

    ఇక బౌలింగ్ విభాగంలో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్ హజల్ వుడ్, బుమ్రా సంయుక్తంగా రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. రవీంద్ర జడేజా ఏడో స్థానంలో ఉన్నాడు.. కులదీప్ యాదవ్ 15వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ పై విజయం సాధించిన అనంతరం టీమిండియా గత ఆరు నెలలుగా టెస్ట్ ఫార్మాట్ క్రికెట్ ఆడలేదు. ఆయనప్పటికీ టీమిండియా ఆటగాళ్లు టాప్ -10 లో తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు. బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ 19 నుంచి స్వదేశంలో టీమిండియా టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో భారత ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తే.. అప్పుడు ర్యాంకులు మారతాయని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.

    అయితే ఈసారి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలవాలని టీమ్ ఇండియా భావిస్తోంది.. ఇందులో భాగంగానే టెస్ట్ క్రికెట్ జట్టులో అనేక మార్పులు చేసింది. దేశవాళి క్రికెట్ ఆడాలని ఆటగాళ్లకు సూచనలు చేసింది. అందులో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్ళను మాత్రమే జట్టులోకి ఎంపిక చేస్తోంది. బంగ్లాదేశ్ తర్వాత టీమ్ ఇండియా ఆస్ట్రేలియా తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఇది టీమిండియా కు అత్యంత ముఖ్యమైన టెస్ట్ సిరీస్. పైగా ఇటీవలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమ్ ఇండియా ఓడిపోయింది.