Rohit Sharma: స్టార్ ఆటగాళ్లు ఆట తీరు మార్చుకోవాలని.. ఆకాశం నుంచి కిందికి దిగి రావాలని.. జట్టు కోసం తీవ్రంగా శ్రమించాలని.. ముఖ్యంగా విఫల ఆట తీరును మర్చిపోవాలని.. బీసీసీఐ ఇటీవల 10 పాయింట్లు నిబంధనను తెరపైకి తెచ్చింది. దీంతో స్టార్ ఆటగాళ్లు మొత్తం రంజీ బాట పట్టారు. రోహిత్ శర్మ నుంచి మొదలుపెడితే విరాట్ కోహ్లీ వరకు అందరు దేశవాళీ క్రికెట్ ఆడుతున్నారు. అయితే దేశవాళి క్రికెట్లోనూ కొంతమంది ఆటగాళ్లు తీరు మారడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందు వరుసలో ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం అతను ముంబై జట్టుకు ఆడుతున్నాడు. ముంబై జట్టు జమ్మూ కాశ్మీర్ తో తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్లో ముంబై జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. రోహిత్ శర్మ దాదాపు చాలా సంవత్సరాల తర్వాత రంజీ క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో అందరి దృష్టి మొత్తం అతనిపై ఉంది. అతడు కూడా అందరి అంచనాలను తగ్గట్టుగానే రాణిస్తాడని అభిమానులు ఊహించారు. అభిమానులు ఊహించింది ఒకటైతే.. రోహిత్ శర్మ చేసింది మరొకటి.. 19 బంతులు ఎదుర్కొన్న రోహిత్.. కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఉమర్ నాజీర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు.. వాస్తవానికి గతంలో ఆఫ్ స్టంప్ బంతులను ఎదుర్కోవడంలో రోహిత్ విఫలమయ్యేవాడు. అయితే రోహిత్ ఆఫ్ స్టంప్ బంతులను ఇటీవల ధైర్యంగా ఎదుర్కొన్నాడు. గంటల కొద్ది ప్రాక్టీస్ చేశాడు. చివరికి ఆఫ్ స్టంప్ బంతులను ఎదుర్కొనే విషయంలో విజయవంతమయ్యాడు. అయితే రోహిత్ మరో వీక్ పాయింట్ కూడా ఉంది.. అదే షార్ట్ పిచ్ బంతులు.. జమ్ము కాశ్మీర్ బౌలర్ ఉమర్ నాజీర్ అదే ప్రయోగం చేశాడు.. చివరికి విజయవంతమయ్యాడు..
ఆ బంతిని ఎదుర్కోవడంలో..
ఉమర్ నాజీర్ షార్ట్ పిచ్ బంతులు వేయడంతో రోహిత్ కాస్త తడబడ్డాడు. అయితే నాజీర్ పదేపదే అదే బంతులు వేయడంతో అసహనానికి గురైన రోహిత్.. ఈసారి ఆ బంతిని అనవసరంగా టచ్ చేశాడు. దీంతో బంతి మిడ్ హాఫ్ లో లేచింది. గాల్లోకి ఎగిరిన ఆ బంతిని ఫీల్డర్ అమాంతం పట్టేసాడు. దీంతో రోహిత్ శర్మ నిరాశతో మైదానాన్ని వీడాడు. ఒకవేళ ఆ బంతిని కనుక రోహిత్ ఆడకుండా ఉండి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఇటీవల కాలంలో రోహిత్ తన వైఫల్యాలను ఎదుర్కోవడానికి ఏమాత్రం ప్రయత్నం చేయడం లేదు. చివరికి అతడి దారుణమైన ఆట తీరును తట్టుకోలేక టీమ్ ఇండియా మేనేజ్మెంట్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్ని టెస్ట్ కు దూరం పెట్టింది. అయినప్పటికీ అతని ఏమాత్రం మార్పు రావడం లేదు. చివరికి అనామక ఆటగాడిగా షాట్లు ఆడుతూ.. అనామక బౌలర్ల చేతిలో అవుట్ అవుతున్నాడు. రంజీ లోనూ ఇదే ఆట తీరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో.. టెస్ట్ జట్టులో అతడికి కెప్టెన్సీ అవకాశం ఇస్తారా? లేదా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.
Rohit Sharma, what a SUPERSTAR !!
To take a pause & catch your breath requires courage … More power to you … Respect !! @ImRo45 pic.twitter.com/PTh5QDwC6q— riyansh ♡ (@Priyanxhx) January 23, 2025