Rohit Sharma: టెస్ట్ లే కాదు. రంజీల లోనూ రోహిత్ శర్మ ఆట తీరు మారలేదు. అంతర్జాతీయ క్రికెట్లో కొంతకాలంగా ఫామ్ కోల్పోయి రోహిత్ శర్మ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. మిగతా స్టార్ క్రికెటర్లు కూడా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్, ఇతర క్రికెటర్లు కూడా రంజీ బరిలోకి దిగుతున్నారు. అయితే రోహిత్ శర్మ దారుణమైన ఆట తీరుతో మళ్లీ విమర్శల పాలయ్యాడు.
రంజి క్రికెట్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో రోహిత్ శర్మ ముంబై జట్టు తరఫున బ్యాటింగ్ కు దిగాడు. 19 బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు. పేస్ బౌలర్ ఉమర్ నాజిర్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు.. దీంతో రోహిత్ శర్మ పై నెట్టింట విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముంబై జట్టు తరఫున యశస్వి జైస్వాల్, అజింక్యా రహనే, శ్రేయస్ అయ్యర్, హార్దిక్, శివం దుబే, శార్దూల్ ఠాకూర్, శంసి మూలానే, తనుష్ కొటియన్, మోహిత్ అవస్తి, కర్షికోతారి వంటి ఆటగాళ్లు ముంబై జట్టు తరఫున ఆడుతున్నారు. కొంతకాలంగా రోహిత్ శర్మ సరైన ఫామ్ లేక ఇబ్బంది పడుతున్నాడు. బంగ్లాదేశ్ తోని నుంచి అతడు ఒక్క మెరుగైన ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. దీంతో అతనిపై విమర్శలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఇటీవల బీసీసీఐ 10 పాయింట్లు విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగానే స్టార్ ఆటగాళ్లు రంజీలో ఆడాలని నిబంధన విధించింది. దాని ప్రకారమే స్టార్ ఆటగాళ్లు రంజీ క్రికెట్ ఆడుతున్నారు.. ఇందులో భాగంగా ముంబై జట్టు తరఫున రంజి క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ.. మరోసారి తన పేలవమైన ఫామ్ ప్రదర్శించాడు. ఏమాత్రం స్ఫూర్తిదాయకమైన ప్రదర్శన చేయకుండా.. కేవలం మూడు పరుగులకే అవుట్ అయ్యాడు. రోహిత్ 3 పరుగులకే అవుట్ కావడంతో మళ్ళీ విమర్శలు మొదలయ్యాయి. రంజీలో కూడా ఇలా ఆడుతున్నావేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.
అదే ఇబ్బంది
ఆఫ్ స్టంప్ బంతులను ఆటంలో రోహిత్ ఇబ్బంది పడుతున్నాడు. గురువారం నాటి జమ్ము కాశ్మీర్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ రోహిత్ అదే వైఫల్యాన్ని ప్రదర్శించాడు. 19 బంతులు ఎదుర్కొన్న అతడు కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. ఆఫ్ స్టంపు బంతిని అనవసరంగా ఆడి వికెట్ చేజార్చుకున్నాడు.. ” అంతర్జాతీయ మ్యాచ్లలో విఫలమవుతున్నావ్. చివరికి దేశవాళి క్రికెట్ కూడా సరిగా ఆడలేక పోతున్నావు. అసలు ఏమైంది నీకు.. నువ్వు నిజంగా రోహిత్ శర్మ వేనా.. నీ ఆట తీరు ఏమైంది.. నీ హిట్ బ్యాటింగ్ ఎక్కడికి వెళ్లిపోయిందని” అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.. మరోవైపు ఢిల్లీ జట్టు సౌరాష్ట్రతో పోటీపడుతోంది. ఢిల్లీ జట్టుకు రిషబ్ పంత్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. విరాట్ కోహ్లీ కూడా ఢిల్లీ టీమ్ లోనే ఆడుతున్నాడు. అయితే మెడ నొప్పి వల్ల విరాట్ కోహ్లీ మ్యాచ్ ఆడటం లేదు.. ఇక సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా ఆడుతున్నాడు. పంజాబ్ జట్టు తరఫున గిల్ బరిలో ఉన్నాడు.. ఢిల్లీ జట్టు తరుపున సనత్, దుల్, పంత్, ఆయుష్, అర్పిత్, మయాంక్, సుమిత్, జాంటీ, శివం శర్మ, హర్ష్, నవదీప్ షైనీ వంటి ఆటగాళ్లు ఆడుతున్నారు.
Rohit Sharma, what a SUPERSTAR !!
To take a pause & catch your breath requires courage … More power to you … Respect !! @ImRo45 pic.twitter.com/PTh5QDwC6q— riyansh ♡ (@Priyanxhx) January 23, 2025