India vs Afghanistan – Rohit Sharma : ప్రస్తుతం ఇండియా ఆఫ్గనిస్తాన్ తో టి 20 సిరీస్ ఆడుతుంది. ఇక ఈ సిరీస్ లో మూడు మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా ఇప్పటికే ఇండియన్ టీమ్ రెండు మ్యాచ్ లను గెలిచి సిరీస్ ని కైవసం చేసుకుంది. ఈరోజు మూడవ టి20 మ్యాచ్ లో కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ ఇస్తూ ముందుకు సాగుతుంది. మొదటిగా ఇండియన్ టీం 22 పరుగుల వద్ద నాలుగు వికెట్లను కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో పడింది.
కానీ ఇండియన్ టీం ని రోహిత్ శర్మ తన స్వశక్తి తో నిలబెట్టాడు అనే చెప్పాలి. రోహిత్ శర్మ రింకు సింగ్ తో కలిసి ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లను చీల్చి చెండడాడు. ఇక ఈ క్రమంలోనే రోహిత్ శర్మ తన ఐదవ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇక రింకు సింగ్ కూడా హాఫ్ సెంచరీని పూర్తి చేసుకొని ఇద్దరు నాటౌట్ గా నిలిచారు. ఇక దీంతో ఇండియన్ టీం నిర్ణీత 20 ఓవర్లకి 212 పరుగులు చేసింది. అయితే రోహిత్ శర్మ చాలా రోజుల నుంచి టి20 మ్యాచ్ లకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అయినప్పటికీ ఈ మ్యాచ్ లో మాత్రం తను పవర్ ఫుల్ ఇన్నింగ్స్ ని ఆడడమే కాకుండా ఇండియన్ టీం లో తన పాత్ర ఏంటో మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు.
కెప్టెన్ గా నిర్ణయాలు తీసుకోవడమే కాదు టీం ఆపదలో ఉన్నప్పుడు టీమ్ ని ఆడుకునే కెపాసిటీ ఉన్న స్టార్ ప్లేయర్ గా మరొకసారి తనని తాను ప్రూవ్ చేసుకున్నాడు…ఇక 69 బంతుల్లో 8 సిక్స్ లు, 11 ఫోర్లతో 121 పరుగులు చేశాడు…ఇక తన టి20 కెరియర్ లో ఒక ఇన్నింగ్స్ లో తను చేసిన అత్యధిక స్కోర్ కూడా ఇదే కావడం విశేషం…ఇక ఇంతకు ముందు శ్రీలంక మీద చేసిన 118 పరుగులు హ్యయెస్ట్ స్కోర్ గా ఉండేది. కానీ ఇప్పుడు ఈ సెంచరీ తో ఆ రికార్డును బ్రేక్ చేసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు…
ఇక రోహిత్ తో పాటు గా రెచ్చిపోయిన మరొక ప్లేయర్ రింకు సింగ్ ఈయన ఆఫ్గనిస్తాన్ ప్లేయర్లకు చుక్కలు చూపించడమే కాకుండా 39 బంతుల్లో 6 సిక్స్ లు, 2 ఫోర్లతో 69 పరుగులు చేసి ఇండియన్ టీం భారీ స్కోర్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు… ఇక దీంతో ఇండియన్ టీమ్ టి20 వరల్డ్ కప్ కి ముందు ఆడబోయే చివరి టి 20 మ్యాచ్ కావడంతో ఇందులో రోహిత్ టచ్ లోకి రావడం ఇండియన్ టీం కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి… నిజానికి రింకు సింగ్ మంచి హిట్టర్ గా తన పూర్తి బాధ్యతని కొనసాగించాడనే చెప్పాలి. చివరి ఓవర్ లో వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్స్ లు కొట్టి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు…