Rohit Sharma: ప్రస్తుతం ఇండియన్ టీమ్ మంచి ఫామ్ లో ఉంది. వరుస విజయాలను అందుకుంటూ వరల్డ్ కప్ కొట్టడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తుంది.ఇక ఇప్పటికే ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా తన ప్రదర్శనను కొనసాగిస్తుంది. ఇక ఈ టైంలో ఇండియా టీమ్ ని ఓడించడం చాలా కష్టం అని ప్రపంచ దేశాల క్రికెట్ టీములు సైతం తీవ్రమైన భయాందోళనలకు గురవుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఇండియన్ టీమ్ ప్లేయర్లు కూడా మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు.
ఇక నెక్స్ట్ బంగ్లాదేశ్ తో ఒక మ్యాచ్ లో తలపడనున్న సందర్భంగా మన ప్లేయర్లు వీలైనంత ఎక్కువసేపు ప్రాక్టీస్ కి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఇంకా ఈ సమయంలో ఇండియన్ టీం ప్లేయర్లు నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో తీసిన ఒక వీడియో ప్రస్తుతం నెట్ లో చాలా వైరల్ అవుతుంది.ఇక ప్రస్తుతం ఆ వీడియోని బీసీసీఐ పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏముంది ఏంటి అనేది మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
ప్రస్తుతం ఉన్న ఇండియన్ టీమ్ లో భారీ హిట్టర్ అయిన రోహిత్ శర్మ నెట్ ప్రాక్టీస్ లో భాగంగా తను బౌలింగ్ కూడా చేయడం జరిగింది.ఇక తను బౌలింగ్ చేస్తుంటే రవీంద్ర జడేజా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక ఈ వీడియోని రిలీజ్ చేసిన బీసీసీఐ రోహిత్ శర్మ రూపం లో ఇండియన్ టీం కి మరో ఆఫ్ స్పిన్నర్ దొరికాడు అంటూ క్యాప్షన్ పెట్టి ఆ వీడియో ని రిలీజ్ చేయడం జరిగింది… ఇక వీడియో చూసిన రోహిత్ అభిమానులు రోహిత్ శర్మ లో మంచి బౌలర్ ఉన్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకా కొంత మంది రోహిత్ శర్మ ని పార్ట్ టైం స్పిన్నర్ గా కూడా వాడుకోవచ్చు అంటూ సలహాలు ఇస్తున్నారు.ఇక ఈ క్రమం మరి కొంతమంది రోహిత్ శర్మ రూపంలో ఇండియన్ టీమ్ కి మరో హార్దిక్ పాండ్యా దొరికాడు అంటూ చలోక్తులు వదులుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రాక్టీస్ టైంలో రోహిత్ శర్మ ఇలా తనలో ఉన్న బౌలర్ ని బయటికి తీయడం అనేది నిజంగా అద్బుతం అనే చెప్పాలి. ఇది చూసిన ఇండియన్ అభిమానులు సైతం అందరూ కూడా రోహిత్ శర్మ ని చాలా బాగా మెచ్చుకుంటున్నారు…
ఇక ఇది ఇలా ఉంటే ఈనెల 19వ తేదీన బంగ్లాదేశ్ మీద జరిగే మ్యాచ్ లో ఇండియన్ టీం భారీ కసరత్తులతో బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మ్యాచ్ లో ఇండియా బంగ్లాదేశ్ ని కనక ఓడించినట్లైతే ఇండియా ఈ వరల్డ్ కప్ లో వరుసగా నాలుగు విజయాలను నమోదు చేసిన ఏకైక టీమ్ గా హిస్టరీ క్రియేట్ చేస్తుంది. దాంతో పాటుగా ఇండియన్ టీం సెమిస్ బెర్త్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ గెలిచే విధంగా ఇండియా చాలా కసరత్తులను చేస్తూ బరిలోకి దిగుతున్నట్లుగా తెలుస్తుంది…
View this post on Instagram