Anchor Suma: తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని యాంకర్ గా తన ప్రయాణం సాగిస్తుంది యాంకర్ సుమ. యాంకర్లలో టాప్ యాంకర్ గా పేరు సంపాదించిన సుమ కేవలం షోలు మాత్రమే కాదు సినిమా ఈవెంట్లు కూడా చేస్తుంటుంది. ఈమె స్టేజ్ పైకి వచ్చిందంటే ఆ ఎటకారం, జోకులు, పంచులు మామూలుగా ఉండవు. యాంకర్ గా, యాక్టర్ గా తన రోల్ ను పర్ఫక్ట్ గా చేస్తుంటుంది. ఈమె మాత్రమే కాదు రాజీవ్ కనకాల కూడా సినిమా ఇండస్ట్రీలో తన ప్రయాణం సాగించాడు. అయితే కొడుకు రోషన్ కూడా హీరోగా పరిచయం చేయాలని ఎన్నో కలలు కన్నదట సుమ. ఎప్పటి నుంచో ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.
తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించాలని ఆయనను కోరిందట. ఈయన ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఎంతో మంది హీరోలు ఇప్పుడు స్టార్లుగా ఎదిగారు. దీంతో సుమ కూడా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తే బాగుంటుందని కొడుకు కోసం అడిగిందట. కానీ దీనికి సమాధానంగా రాఘవేంద్ర రావు తన కాళ్లు పట్టుకోవాలి అన్నారట. దీంతో సుమ నిజమే అనుకొని వెంటనే ఆయన కాళ్లపై పడ్డారు. ఒక్కసారిగా షాక్ అయినా రాఘవేంద్రరావు నేను ఏదో సరదాగా అన్నానమ్మా అలా చేయకు ముందు పైకి లేవు అని చెప్పారట. నీ కొడుకును నాకన్నా మంచి దర్శకుల చేత ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయిస్తాను అంటూ సుమకు మాట ఇచ్చారట. అయితే సుమ తన కొడుకును పరిచయం చేయడం కోసం ఇలా రాఘవేంద్రరావు కాళ్లు పట్టుకోవడంతో రాజీవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు అనే టాక్ వినిపిస్తోంది.
ఆ డైరెక్టర్ తో ఈ డైరెక్టర్ తో ఇండస్ట్రీకి పరిచయం చేయడం వల్ల సక్సెస్ రాదు. మన కొడుకు ఇండస్ట్రీలో సక్సెస్ కావాలి అంటే తనలో టాలెంట్ ఉండాలని చెప్పారట. అంతే కాదు టాలెంట్ ఉన్నప్పుడు తప్పకుండా సక్సెస్ అవుతారని.. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేయవద్దు అన్నారట. ఇదిలా ఉంటే సుమా కుమారుడు బబుల్ గమ్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాకు రవికాంత్ పేరేపు తెరకెక్కిస్తున్నారు. మరి మొదటి సారి ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అవుతున్న రోషన్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారో చూడాలి.