Rohit And Kohli Retirement: బీసీసీఐ నిబంధనల ప్రకారం A++ కేటగిరి లో ఉండే ప్లేయర్లకు ప్రతి ఏడాది ఏడు కోట్ల వరకు వేతనం లభిస్తుంది.. అయితే టెస్టులు, వన్డేలలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కొనసాగుతున్న నేపథ్యంలో వారికి ఆ కేటగిరి ఇచ్చింది. అయితే ఇప్పుడు విరాట్, రోహిత్ టెస్ట్ ఫార్మాట్ కు శాశ్వత వీడ్కోలు పలికారు. దీంతో వారి కాంట్రాక్టుకు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే వీరిద్దరికీ బీసీసీఐ ఏ++ కేటగిరి ఇచ్చింది. అయితే ఇప్పుడు విరాట్, రోహిత్ టెస్ట్ ఫార్మాట్ నుంచి బయటికి వెళ్లిపోయిన నేపథ్యంలో వారికి ఆ కాంట్రాక్ట్ ఉంటుందా.. లేదా ఎవరైనా కొత్త ఆటగాళ్లకు ఇస్తారా.. లేకపోతే అన్ని నిబంధనల ప్రకారమే బీసీసీఐ నడుచుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే రోహిత్, విరాట్ కెప్టెన్సీ విషయంలోనే జట్టు నుంచి బయటికి వెళ్లిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. జట్టు కంటే తమ ప్రయోజనాలే ముఖ్యమనే దిశగా వారు తమ ప్రయాణాన్ని సాగించారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే విరాట్, రోహిత్ కాంట్రాక్ట్ విషయంలో బీసీసీఐ పునరాలోచన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అదే తీరుగా బీసీసీఐ కనుక నిర్ణయం తీసుకుంటే.. విరాట్, రోహిత్ భవితవ్యం ఏంటి? వారి స్థానంలో చోటు సంపాదించుకునే ఆటగాళ్లు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.
Also Read: పనిచేయని బీసీసీఐ బుజ్జగింపులు.. టెస్టులపై విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం
ఎవరితో భర్తీ చేస్తారు
విరాట్, రోహిత్ టెస్ట్ జట్టు నుంచి బయటికి వెళ్లిపోయిన నేపథ్యంలో.. వారి స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే జాతీయ మీడియాలో ప్రసారమవుతున్న కథనాల ప్రకారం.. విరాట్ కోహ్లీ స్థానాన్ని కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ స్థానాన్ని గిల్ తో భర్తీ చేస్తారని తెలుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ వల్ల కేఎల్ రాహుల్ కు స్థిరమైన అవకాశాలు టెస్ట్ జట్టులో లభించడం లేదు. దానివల్ల అతడు జట్టులోకి రావడం.. పోవడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే టెస్ట్ లలో కేఎల్ రాహుల్ అద్భుతమైన ప్లేయర్. సూపర్ టెక్నిక్ తో బ్యాటింగ్ చేస్తాడు. జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడతాడు. అందువల్లే అతడు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ అభినందనలు కూడా పొందాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ జట్టు నుంచి వెళ్లిపోయాడు కాబట్టి ఆస్థానాన్ని కేఎల్ రాహుల్ భర్తీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కేఎల్ రాహుల్ గనుక ఇంగ్లాండ్ సిరీస్లో తనను తాను నిరూపించుకుంటే అతని స్థానానికి ఇక తిరుగు ఉండదు..గిల్ కూడా ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అటు వన్డే, ఇటు టెస్ట్ ఫార్మాట్ లలో వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. టి20లతో పోల్చి చూస్తే.. టెస్టులు భిన్నంగా ఉంటాయి. ప్రణాళికలు.. ఇతర టెక్నిక్స్ అమలు చేయడానికి కాస్త సమయం దొరుకుంది. అలాంటప్పుడు గిల్ కు తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం లభిస్తుంది. ఒకవేళ గనుక వచ్చిన అవకాశాన్ని గిల్ సద్వినియోగం చేసుకుంటే టెస్ట్ కెప్టెన్ గా అతడికి తిరుగు ఉండదు. పైగా అతడు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సమయోచితంగా బ్యాటింగ్ చేస్తాడు. పైగా అతడు తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని.. తను ఏంటో నిరూపించుకున్నాడు. మొత్తంగా చూస్తే విరాట్, రోహిత్ జట్టు నుంచి బయటికి వెళ్లిపోవడంతో.. గిల్, కేఎల్ రాహుల్ పంట పండేటట్టే కనిపిస్తోంది.