Rishabh Pant: టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఫ్రాక్చర్ కావడంతోపాటు శరీరంలోని పలు భాగాలకు శస్త్ర చికిత్సలను కూడా నిర్వహించారు. ప్రమాదం తర్వాత పూర్తిగా ఆసుపత్రికి, ఇంటికి పరిమితమైన రిషబ్ పంత్.. ప్రస్తుతం వేగంగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నాడు. వీలైనంత త్వరగా భారత జట్టులోకి చేరడమే లక్ష్యంగా రిషబ్ పంత్ వర్క్ అవుట్లు చేస్తున్నాడు.
గత ఏడాది రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్ వేగంగా కోరుకుంటున్నాడు. ఈ ఏడాది అక్టోబర్ లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రషబ్ పంత్.. అందుకు అనుగుణంగా తీవ్రంగానే శ్రమిస్తున్నాడు. తాజాగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ జిమ్ లో రిషబ్ పంత్ వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను షేర్ చేసిన రిషబ్ పంత్ లెజెండరీ గా ఉండండి అనే కొటేషన్ ను ట్యాగ్ చేసి పోస్ట్ చేశాడు. దీనిపై సామాజిక మాధ్యమాలు వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. పంత్ నువ్వు ఒక లెజెండ్ అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వరల్డ్ కప్ లో తప్పకుండా ఆడాలి అంటూ పలువురు కామెంట్ చేస్తుండగా.. వరల్డ్ కప్ హీరోగా నువ్వే నిలవాలి అంటూ మరికొందరు ఆకాంక్షిస్తున్నారు.
వైద్య ఖర్చులను భరించిన బీసీసీఐ..
రిషబ్ పంత్ ప్రమాదానికి గురైన తర్వాత బీసీసీఐ అండగా నిలిచింది. పంత్ కు మెరుగైన వైద్య సేవలను బీసీసీఐ ముంబైలో అందించింది. ఇందుకు అయిన మొత్తం ఖర్చును బీసీసీఐ భరించింది. రిషబ్ పంత్ కు అన్ని వేళలా అండగా ఉంటామని చెప్పడంతోపాటు కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున భరోసాను కల్పించింది బీసీసీఐ. ప్రమాదం జరిగిన తర్వాత రిషబ్ పంత్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరు క్రికెట్ అభిమానుల మనసును దోచుకుంది. ఇక రిషబ్ పంత్ క్రికెట్ కెరియర్ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 33 టెస్ట్ మ్యాచ్లు ఆడగా 43.67 యావరేజ్ తో 221 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 159 పరుగులు కాగా ఐదు సెంచరీలు, 11 అర్థ సెంచరీలు ఉన్నాయి. అలాగే, 30 వన్డే మ్యాచ్ లు ఆడిన పంత్ 34.60 సగటుతో 865 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ సహా 5 అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక టి20 కెరియర్ విషయానికి వస్తే 66 టి20 మ్యాచ్ లు ఆడిన పంత్ 22.43 సగటుతో 987 పరుగులు చేశాడు. ఇందులో మూడు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇకపోతే రిషబ్ పంత్ ఫార్మాట్ ఏదైనా అగ్రిషివ్ గా ఆడి జట్టుకు భారీగా పరుగులు చేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. భారత జట్టు అనేక టెస్టుల్లో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన అగ్రెసివ్ ఆటతో జట్టుకు అపురూప విజయాలను అందించి పెట్టాడు రిషబ్ పంత్. అటువంటి పంత్ వన్డే వరల్డ్ కప్ నాటికి ఫిట్నెస్ సాధించి జట్టులోకి వస్తే జట్టుకు బలం పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.