Upasana Konidela Assets: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) సతీమణి ఉపాసన కొణిదెల(Upasana Konidela) గురించి, ఆమె బ్యాక్ గ్రౌండ్ వివరాల గురించి తెలియని తెలుగోడంటూ ఎవ్వరూ లేరు. దేశవ్యాప్తంగా ప్రఖ్యాత గాంచిన అపోలో హాస్పిటల్స్ ని స్థాపించిన ప్రతాప్ రెడ్డి కుమార్తె ఆమె. ప్రస్తుతం ఉపాసన అపోలో హాస్పిటల్స్ కి చైర్మన్ గా వ్యవహరిస్తోంది. సమర్థవంతంగా ఈ హాస్పిటల్స్ ని రన్ చేయడమే కాకుండా, ఎన్నో సేవ కార్యక్రమాలు, అనాధాశ్రమాలను కూడా నడుపుతూ ఆదర్శ మహిళగా కొనసాగుతుంది. రీసెంట్ గానే తెలంగాణ ప్రభుత్వం ఈమెని గుర్తించి తెలంగాణ స్పోర్ట్స్ హబ్ కి కో చైర్మన్ గా నియమించారు. ఒక పక్క భర్త సినీ రంగం లో అద్భుతమైన విజయాలు సాధిస్తూ తెలుగు సినిమా గర్వపడే స్థాయికి తీసుకెళ్తుంటే, మరోపక్క ఉపాసన కూడా ఇలా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధిస్తూ తన కంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ని ఏర్పాటు చేసుకుంటుంది.
Also Read: ఇంగ్లాండ్ సిరీస్ లో రాణించినప్పటికీ వారిపై వేటు.. ఆసియా కప్ లో ఆడేది వీరే..
ఇదంతా పక్కన పెడితే ఉపాసన కి కుటుంబం ద్వారా వచ్చే ఆస్తులు త్వరలోనే ఆమె చేతుల్లోకి రాబోతుంది. ఈ ఆస్తుల విలువ అక్షరాలా 77 వేల కోట్ల రూపాయలట. ఇది సాధారణమైన విషయం కాదు, 77 వేల కోట్ల రూపాయిలు అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఏడాది బడ్జెట్ కంటే ఎక్కువ అన్నమాట. దేశంలోనే అత్యంత సంపన్నులలో ఒకరు ఆమె. ఇంత ఆస్తికి అధిపతి అయినా ఆమెలో ఇసుమంత గర్వం కూడా కనిపించకపోవడం విశేషం. ఒక సాధారణ మహిళ లాగానే ఆమె నడుచుకుంటూ ఉంటుంది. ఈమెని చూసి నేటి తరం ఆడపిల్లలు కచ్చితంగా నేర్చుకోవాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. రామ్ చరణ్ జీవితాన్ని కూడా ఉపాసన రాక ముందు, ఉపాసన వచ్చిన తర్వాత అని విభజించవచ్చు. అప్పట్లో రామ్ చరణ్ మంచి ఫైర్ బ్రాండ్ గా ఉండేవాడు, ఎవరైనా ఏదైనా మెగా ఫ్యామిలీ పై కామెంట్ చేస్తే ఇచ్చి పారేసేవాడు, రామ్ చరణ్ లో ఉన్న ఆ ఫైర్ ఉపాసన ని పెళ్లి చేసుకున్న తర్వాత పోయింది.
దీనిని అభిమానులు కూడా గమనించారు. పెళ్లి తర్వాత రామ్ చరణ్ రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించడం చాలా వరకు తగ్గించేసాడు. గోవిందుడు అందరివాడేలే చిత్రం లో రొమాన్స్ డోస్ కాస్త అప్పట్లో ఎక్కువైంది. ఆ సమయం లో ఉపాసన కాస్త ఫైర్ అయ్యింది అనే టాక్ కూడా ఉండేది. అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆమెకు వస్తున్న ఈ 77 వేల కోట్ల ఆస్తికి భవిష్యత్తులో వారసురాలు క్లిన్ కారా అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ పాప ఎన్ని జన్మల పుణ్యం చేసుకుందో, ఆమె కడుపులో పుట్టింది. దేనికైనా రాసి పెట్టి ఉండాలని పెద్దలు ఊరికే అనరు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.