Rishabh Pant Injured Foot: నిజంగా పంత్ గుండె చాలా గట్టిది. లేకపోతే అంతటి ప్రమాదాన్ని ఎదుర్కొని నిలబడిందంటే మామూలు కాదు. పంత్ సంకల్పం చాలా బలమైనది.. లేకపోతే అంతటి గాయాన్ని సైతం తట్టుకొని.. తిరిగి మైదానంలోకి వచ్చేలా చేసిందంటే మామూలు విషయం కాదు.. అందుకే అభిమానులు రిషబ్ పంత్ ను వారియర్ అని పిలుస్తున్నారు. నీలాంటి వాడే జట్టుకు కావాలి అని నినదిస్తున్నారు. ఓవైపు ఇబ్బంది పెడుతున్న గాయం.. మరోవైపు జట్టుకు భారీగా పరుగులు కావలసిన సందర్భం.. ఈ రెండిట్లో ఏది కావాలి అంటే.. రెండవ దానికే ఓటు వేశాడు రిషబ్ పంత్. గాయం ఇబ్బంది పెడుతున్నా సరే మైదానంలోకి దిగాడు.. అప్పటిదాకా స్థిరంగా ఆడుతున్న శార్దూల్ ఠాకూర్ 41 పరుగుల వద్ద అవుట్ అయినప్పుడు.. అనేక సంశయాలు.. సందేహాల మధ్య మైదానంలోకి వచ్చాడు రిషబ్ పంత్. అతడు మైదానంలోకి వస్తుంటే స్టేడియం స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. రిషబ్ రిషబ్ అంటూ నినాదాలతో దద్దరిల్లిపోయింది.
వోక్స్ వేసిన బంతి మరొక ఆటగాడికి గనక తగిలి ఉంటే.. అతడు బ్యాటింగ్ కాదు కదా.. కాని హాస్పిటల్ బెడ్ నుంచి కిందికి దిగడానికి కూడా ఇష్టపడేవాడు కాదు.. పైగా ఆ బంతి కాలు వేలి ఎముకకు బలంగా తగిలింది. బంతి తగిలినప్పుడు రిషబ్ పంత్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. నొప్పికి తట్టుకోలేక గట్టిగా అరిచాడు. అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేకపోవడంతో అంబులెన్స్ లో అతడిని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి స్కానింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే అతడి పరిస్థితి గురించి చెబుతామని బీసీసీఐ చెప్పింది అంటే.. రిషబ్ పంత్ కు గాయం ఎంతలా అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నప్పటికీ రిషబ్ పంత్ జట్టు కోసం మైదానంలోకి వచ్చాడు. అతడి బ్యాటింగ్ ఎలా ఉంటుంది.. పరుగులు ధారాళంగా చేయగలుగుతాడా.. అనే విషయాలను పక్కన పెడితే.. తనకు అంత నొప్పిగా ఉన్నప్పటికీ మైదానాల్లోకి వచ్చాడు. జట్టు కోసం ఆడేందుకు ప్రయత్నించాడు. ఒకవైపు కుంటుకుంటూనే పరుగులు తీయడం మొదలుపెట్టాడు.
వాస్తవానికి రిషబ్ పంత్ కు ఆ స్థాయిలో గాయం అయింది కాబట్టి.. అతడు బ్యాటింగ్ కు వచ్చేది అనుమానమేనని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. చివరికి బీసీసీఐ కూడా అదే తీరుగా సంకేతాలు ఇచ్చింది. కానీ రిషబ్ పంత్ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా వచ్చాడు. తన గాయాన్ని పక్కనపెట్టి జట్టు కోసం మైదానంలోకి దిగాడు. ఒకరకంగా దేశం కోసం ఒక సోల్జర్ సేవ చేసినట్టుగా.. తను జట్టు కోసం రంగంలోకి దిగాడు. అందువల్లే అతని ఒక సైనికుడితో పోల్చుతున్నారు. నీలాంటి వాళ్లే జట్టుకు కావాలని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. వ్యక్తిగత రికార్డులను పక్కనపెట్టి.. ఆరోగ్యాన్ని కూడా పక్కనపెట్టి జట్టు కోసం వచ్చావంటే.. నీ గుండె చాలా బలమైనదని రిషబ్ పంత్ ను ఉద్దేశించి అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇక రిషబ్ పంత్ రెండవ రోజు మైదానంలోకి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.
THE WARRIOR WALK BY PANT.
– Rishabh Pant has walked out to bat with an injured toe. pic.twitter.com/O6xg4C5bmz
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 24, 2025