IND Vs SA: ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ గెలిచిన తర్వాత.. రోజుల వ్యవధిలోనే టీమిండియా మరో సిరీస్ కు సిద్ధమైంది. టీమిండియా స్వదేశం వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఇప్పటికే జట్టును ప్రకటించింది. మేనేజ్మెంట్ ప్రకటించిన జట్టులో రిషబ్ పంత్, జురెల్ కూడా ఉన్నారు. వారిద్దరికీ సంబంధించిన ఒక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇది అభిమానులకు ఫ్యూజులు ఎగిరిపోయేలా ఉంది.
టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కంటే ముందు.. దక్షిణాఫ్రికా ఏ జట్టుతో అనధికారిక టెస్టులు ఆడింది. ఈ టెస్టులలో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. ముఖ్యంగా దూసుకు వచ్చిన బంతులను తట్టుకోలేక అతడు కింద పడిపోయాడు. ఏకంగా మూడుసార్లు అతడు గాయపడిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అతడిని ఆసుపత్రికి తరలించారు.. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడు. అతనికి సంబంధించిన అప్డేట్ ఇంతవరకు రాలేదు. దీంతో అతడు దక్షిణాఫ్రికా జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ లో ఆడబోడని అందరికీ అర్థమైంది. దీంతో అతని ప్లేస్ ను ఎవరితో రీప్లేస్ చేస్తారనేది అంతు పట్టకుండా ఉంది.
రిషబ్ పంత్ పరిస్థితి అలా ఉంటే.. జురెల్ పరిస్థితి కూడా అలానే మారిపోయింది. అతడు కూడా సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అతడు గాయపడ్డాడు. అతడిని పరీక్షించిన వైద్యులు నాలుగు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అటు రిషబ్.. ఇటు జురెల్ గాయపడిన నేపథ్యంలో.. ఎవరు వికెట్ కీపర్ అవతారనేది అర్థం కాలేదు. కేఎల్ రాహుల్ ఆ బాధ్యత స్వీకరిస్తాడని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రిషబ్ పంత్, జురెల్ కూడా ఆడతారని తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ డస్కౌటే వెల్లడించాడు.
” ఇటీవల సౌత్ ఆఫ్రికా ఏ జట్టుతో జరిగిన అనధికారిక టెస్టులో జురెల్ రెండు సెంచరీలు సాధించాడు. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అయితే అతను గాయపడిన నేపథ్యంలో చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. విశ్రాంతి కూడా తీసుకోవాలని సూచించారు. అతని పరిస్థితి మెరుగుపడుతోందని వార్తలు వస్తున్నాయి. అలాంటప్పుడు అతడు ఆడే అవకాశం లేకపోలేదు. అటు పంత్ కూడా రికవరీ అయ్యాడు. వీరిద్దరిలో ఎవరో ఒకరు ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇద్దరినీ ఆడించాలనుకుంటే ఒకరు మాత్రమే కీపర్ అవుతారని” డస్కౌటే పేర్కొన్నాడు.