Rohit Sharma- Hardik Pandya: ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తంలో అత్యంత ప్రజాదారణ పొందిన లీగ్ గా ఐపీఎల్ ఒక చరిత్రను క్రియేట్ చేసింది. రెండు నెలల పాటు సాగే ఈ ఐపీఎల్ లో ప్రపంచానికి చెందిన వివిధ దేశాలలో ఉన్న ప్లేయర్లు అందరూ కూడా ఇందులో పాల్గొని తమదైన రీతిలో వాళ్ళ పర్ఫామెన్స్ లను చూపించుకొని ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును పొందుతున్నారు. ఇక ఐపీఎల్ లో ఆడి ఆ తర్వాత వాళ్ళ దేశం తరుపున ఇంటర్నేషనల్ టీమ్ లకు ఆడిన వాళ్ళు చాలామంది ప్లేయర్లు ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఐపిఎల్ లో ఇప్పుడు రసవత్తరమైన పోటీ నడుస్తుంది. 2023 ఐపీఎల్ ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ పైన ఘన విజయాన్ని సాధించి చెన్నై టీం ఐదోసారి ఐపీఎల్ టైటిల్ ని అందుకున్న టీం గా హిస్టరీ క్రియేట్ చేసింది.
ఇక ఇదే సమయంలో ఇప్పుడు ఐపీఎల్ లోనే అత్యంత ముఖ్యమైన టీమ్ గా పేరు సాధించిన ముంబై ఇండియన్స్ టీమ్ లో ప్లేయర్ల ఎంపిక పైన చాలా కసరత్తులను చేస్తున్నారు.ఇక ఇప్పటికే ఈ టీం కి 5 సార్లు ఐపీఎల్ కప్ ను అందించిన రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించి ఆయన ప్లేస్ లో హార్దిక్ పాండ్యని టీంలోకి తీసుకోవాలనే ఉద్దేశ్యం లో టీమ్ మ్యాజమాన్యం ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక దానికి కారణం ఈ ఇయర్ లోనే రోహిత్ కెప్టెన్సీ లో టెస్ట్ వరల్డ్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లోకి ఓడిపోవడం,అలాగే వన్డే వరల్డ్ కప్ కూడా ఫైనల్ కి వచ్చి ఓడిపోవడం చూసిన ముంబై ఇండియన్ టీమ్ యాజమాన్యం రోహిత్ కెప్టెన్సీ పైన అంత సుముఖత తో లేనట్టు గా తెలుస్తుంది…ఇక అందులో భాగంగానే గుజరాత్ టీంలో ఉన్న హార్దిక్ పాండ్య ని 15 కోట్లు పెట్టి ముంబై ఇండియన్స్ టీం కొనుగోలు చేసే దిశ గా ముందుకు కదులుతుంది.
అయితే ఇదంతా రోహిత్ శర్మ కి నచ్చడం లేదనే విషయం కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా రోహిత్ శర్మ , హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా ఇన్ స్టా లో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకోవడం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో చిన్నపాటి గొడవ కూడా జరుగుతుందన్నట్టుగా వార్తలైతే బయటికి వస్తున్నాయి. నిజానికి రోహిత్ శర్మ లాంటి ఒక మంచి కెప్టెన్ టీమ్ లో వున్నప్పుడు ముంబై ఇండియన్స్ టీమ్ మళ్ళీ హార్థిక్ పాండ్యం ని తీసుకోవడం ఎందుకు అని చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక మరికొందరైతే రోహిత్ శర్మ తర్వాత ఆ టీంని లీడ్ చేయడానికి సూర్య కుమార్ యాదవ్ లాంటి ఒక బెస్ట్ ప్లేయర్ టీమ్ లో ఉన్నాడు రోహిత్ తర్వాత సూర్య ని కెప్తెంగా వాడుకోవచ్చు అని తెలిసిన కూడా మళ్ళీ వీళ్ళు హార్దిక్ పాండ్య ని ఎందుకు తీసుకోవాలను కుంటున్నాడు అనేది ఎవరికి అర్థం కావడం లేదు అంటూ పలువురు క్రికెట్ అభిమానులు సైతం వాళ్ల కామెంట్లను వ్యక్తం చేస్తున్నారు…