https://oktelugu.com/

RCB Vs RR: చెదిరిన ఆర్సీబీ టైటిల్‌ కల.. ఓటమికి కారణాలివే!

ఐపీఎల్‌ సీజన్‌ 17లో అందరూ ఇప్పడు ఆర్సీబీ ఓటమి గురించే చర్చించుకుంటున్నారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కారణమంటూ చాలా మంది ట్రోల్‌ చేస్తున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : May 23, 2024 / 03:29 PM IST

    RCB Vs RR

    Follow us on

    RCB Vs RR: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతోపాటు ఆ జట్టు అభిమానుల హార్ట్‌ బ్రేక్‌ అయింది. 17 ఏళ్లుగా ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని ఆ జట్టు 17వ టైటిల్‌ తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో పోరాడింది. లీగ్‌ దశలో మొదట 7 మ్యాచ్‌లో ఓడిపోయిన ఆ జట్టు.. తర్వాత వరుసగా 6 మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్‌కు చేరింది. కానీ, ఫైనల్స్‌ ముందు బోల్తాపడింది. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడిపోయి టోర్నీ నుంచి నిరాశగా నిష్క్రమించింది.

    ఈ సాలా కప్‌ నమ్‌దే స్లోగన్‌తో..
    ఈసారి ఆర్సీబీ ఈ సాలా కప్‌ మనదే స్లోగన్‌తో టోర్నీలో దూకుడు ప్రదర్శించింది. అయితే లీగ్‌ దశలో తొలి ఏడు మ్యాచ్‌లు కలిసి రాలేదు. అయితే తర్వాత పుంజుకున్న టీం.. సమష్టిగా ఆరు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అయితే టైటిల్‌కు రెండడుగుల దూరంలో బోల్తాపడింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నాలుగు తప్పులతో చేతులు ఎత్తేసింది. అయితే ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని ఈ జట్టుకు ఇప్పటికీ మంచి ఆదరణ ఉండడం అభినందించాల్సి అంశం. చెన్నై సూపర్‌ కింగ్స్, ముంబై ఇండియన్స్‌ లాంటి సక్సెస్‌ఫుల్‌ టీంలకు దీటుగా ఆర్సీబీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది.

    ఆర్సీబీ ఓటమికి కారణాలివే..
    ఐపీఎల్‌ సీజన్‌ 17లో అందరూ ఇప్పడు ఆర్సీబీ ఓటమి గురించే చర్చించుకుంటున్నారు. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కారణమంటూ చాలా మంది ట్రోల్‌ చేస్తున్నారు. మిగతా స్టార్‌ ఆటగాళ్లు కూడా ఏం తక్కువ తినలేదు. మ్యాక్స్‌వెల్‌ ఈ సీజన్ మొత్తం ప్లాప్‌ అయ్యాడు. గెలవాల్సిన నిన్నటి మ్యాచ్‌లో కూడా డక్‌ ఔట్‌ అయ్యాడు. ఈ సీజన్‌లో ఇది అతనికి నాలుగో డక్‌ ఔట్‌. ఇక బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ నిరాశపరిచాడు. ఈజీ క్యాచ్‌ను డ్రాప్‌ చేశాడు. దీంతో ఓటమికి బాధ్యత మొత్తం మ్యాక్స్‌వెల్‌పైనే వేస్తున్నారు. అయితే మ్యాక్స్‌వెల్‌తోపాటు మిగతా ఆటగాళ్లు కూడా ఓటమిలో భాగమే అంటున్నారు ఎక్స్‌పర్ట్స్‌.

    ఆరెంజ్‌ క్యాప్‌ చాలా…?
    ఆర్సీబీ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఉన్నాడు. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోహ్లీ 33 పరుగులు చేశాడు. అతను ఉన్న ఫామ్‌కు.. చేసిన పరుగులకు ఏమాత్రం సంబంధం లేదు. అనవసరపు షాట్‌కు ప్రయత్నించి ఔటవ్వడం ఫ్యాన్స్‌ జీర్ణించుకోవడం లేదు. లీగ్‌ దశలో అదరగొట్టే కింగ్‌ కోహ్లీ.. ప్లే ఆఫ్స్‌లో మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపర్చాడు. ఇప్పటి వరకు ప్లే ఆఫ్స్‌లో కోహ్లీ 15 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ కేవలం 341 పరుగులే చేశాడు. గతంలోలాగానే ఈసారి కూడా విఫలమయ్యాడు. ఈ సిరీస్‌లో 15 మ్యాచ్‌లు ఆడి 741 పరుగులు చేశాడు. ఆరెంజ్‌ క్యాప్‌ కోహ్లీ దగ్గరే ఉంది. ఆరెంజ్‌ క్యాప్‌ కోసం కాకుండా జట్టు కోసం ఆడాల్సిందని ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు.

    కీ ప్లేయర్లను వదులుకుంటున్నారు..?
    ఆర్సీబీ ఓటమికి మరో కారణం బౌలింగ్‌. పేస్‌ను నమ్ముకోవడమే తప్ప బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్, కమిన్స్‌ లాంటి ఇన్నోవేటివ్, మ్యాచ్‌ విన్నింగ్‌ బౌలర్లు ఒక్కరూ లేరు. అందుకే 200కు పైగా స్కోర్లు చేసి కూడా ఆర్సీబీ ఓడిపోవాల్సి వచ్చింది. ఆర్సీబీ ఓటములకు మరో కారణం కీలక ఆటగాళ్లను వదులుకోవడం. కీ స్పిన్నర్‌గా ఉన్న చాహల్‌ను ఈసీజన్‌లో వదులుకున్నారు. ఆల్‌రౌండర్‌ శివమ్‌దూబేను మళ్లీ రీటైన్‌ చేసుకోలేదు. నాలుగేళ్లుగా ఇలా కీ ప్లేయర్లను ఆర్సీబీ వదులుకుంటోంది. ఇందులో క్రిస్‌ గేల్, కేఎల్‌ రాహుల్, దేవదూత్‌ పడిక్కల్‌ సహా చాలా మందే ఉన్నారు.