IND v ENG: క్రికెట్ మ్యాచ్ లో కొన్ని సందర్భాల్లో కొన్ని అరుదైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి.ఇక అందులో భాగంగానే నిన్న ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇండియన్ ప్లేయర్ల చేతికి నల్ల రిబాన్లను కట్టుకొని ఆడటం మనం చూశాం…
ఇక ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియా వేదిక గా ఇండియన్ ప్లేయర్లు ఎందుకు చేతులకి నల్ల రిబ్బన్లు కట్టుకున్నారు అనే క్వశన్స్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది.అయితే మన వాళ్ళు ఇప్పుడనే కాదు ఇంతకు ముందు కూడా ఇలా చాలా సార్లు నల్ల రిబ్బన్స్ తో మ్యాచ్ లు ఆడటం మనం చూశాం…అయితే ఇండియన్ మాజీ క్రికెటర్ అయిన బిషన్ సింగ్ బేడీ అనే ప్లేయర్ ఈనెల 23 వ తేదీన చనిపోవడం జరిగింది. ఇక దాంట్లో భాగంగానే ఆయనని గుర్తుచేసుకుంటూ ఆయన మృతి పట్ల ఆయనకి నివాళులు అర్పించారు.దానికి సంకేతం గానే ఆ నల్ల రిబ్బన్లు కట్టుకొని ఆయనకి నివాళులు అర్పించారు…
ఈయన 1946 వ సంవత్సరం లో పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించ్చాడు.అయితే ఈయనకి క్రీకెట్ మీద ఉన్న ఇష్టం తో క్రికెటర్ గా తను ఎదగాలని ప్రయత్నం చేశాడు. అలాగే తను అనుకున్న లక్ష్యాన్ని కూడా తను రీచ్ అయ్యాడు…ఇక బిషన్‌సింగ్ బేడీ తన ఎంటైర్ కెరియర్ లో 266 వికెట్లు తీసుకున్నాడు.ఈయన బౌలింగ్ ని ఎదుర్కోవడం అంటే ఆషామాషీ విషయం కాదు.14సార్లు 5 వికెట్లు తీసిన బౌలర్ గా అరుదైన రికార్డ్ ని కూడా సాధించాడు.ఇక ఒక మ్యాచ్ లో ఒక వికెట్ తీయడమే గగనం అనుకుంటున్న టైం లో ఒక మ్యాచ్‌లోనే పదికి 10 వికెట్లు సాధించాడు. అయితే ఈయన లాంటి ఒక డైనమిక్ ప్లేయర్ ఇండియన్ టీమ్ లో ఉన్నాడు కాబట్టే ఇండియన్ టీమ్ అప్పట్లో వరుస విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్లింది…
1975 వ సంవత్సరం లో ఇండియన్ టీమ్ గెలిచిన ప్రతి మ్యాచ్ లో కూడా ఈయన కీలక పాత్ర వహించేవాడు. ఇక ఈయన ఇండియన్ టీమ్ కి చాలా కాలం పాటు ఎనలేని విజయాలను కూడా అందించాడు… దాంతో పాటు గా ఇండియన్ టీమ్ లో అత్యంత ప్రతిభ ఉన్న ప్లేయర్ గా కూడా బిసిసిఐ అతన్ని గుర్తించడం జరిగింది…
ఇక ఆయన శిష్యరికం లో చాలా మంది ప్లేయర్లు ఇండియన్ టీమ్ కి ఆడటం జరిగింది….ముఖ్యంగా మణీందర్‌సింగ్, సునీల్ జోషీ, మురళీ కార్తీక్ వంటి స్పిన్నర్లను తీర్చిదిద్దింది ఆయనే.ఇక ఈయన అప్పట్లో ఒక నాలుగు సంవత్సరాల పాటు ఇండియన్ టీమ్ కి కెప్టెన్ గా కూడా చేస్తూ తనదైన గుర్తింపు చాటుకున్నాడు.ఇక అలాంటి ఒక గొప్ప వ్యక్తి మరణం పట్ల ఎవరు సంతాపం తెలిపిన, తెలపకపోయిన పర్లేదు కానీ క్రికెటర్లు మాత్రం తప్పకుండా వాళ్ల నివాళులు అర్పించాలనే ఉద్దేశ్యంతోనే మన ప్లేయర్లు నిన్నటి మ్యాచ్ లో చేతికి అలా నల్ల రిబ్బన్లతో కనిపించారు…