RCB VS PBKS : ప్రస్తుతం విరాట్ కోహ్లీ వయసు 36 సంవత్సరాలు. అయినప్పటికీ ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలాగే కనిపిస్తాడు. మైదానంలో చిరుత పులి మాదిరిగా పరుగులు తీస్తుంటాడు. ఇక ఫీల్డింగ్ లో అయితే సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతాడు. బ్యాటింగ్ చేసే విషయంలో.. ఫీల్డింగ్ చేసే విషయంలో.. ఏమాత్రం రాజిపడడు. అందువల్లే విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ ప్రీక్ అని పిలుస్తుంటారు. ఇక పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ కథనం రాసే సమయం వరకు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓపెనర్ సాల్ట్ ఒక్క పరుగుకే అవుట్ అయినప్పటికీ విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ రెండో వికెట్ కు ఏకంగా 103 పరుగులు జోడించారు. పడిక్కల్ 61 పరుగులు చేశాడు.
Also Read : అర్జున్ రెడ్డి రేంజ్ లో విరాట్ కోహ్లీ..ఈ స్టార్ ఆటగాడికి ఏమైంది?
మామూలు ఫిట్ నెస్ కాదు
36 సంవత్సరాల వయసులోనూ విరాట్ కోహ్లీ తనకు మాత్రమే సాధ్యమయ్యే తీరుగా ఫిట్ నెస్ కాపాడుకుంటాడు. అంతే కాదు విరాట్ కోహ్లీ స్ట్రైకర్ గా ఉంటే.. మరో బ్యాటర్ వికెట్ల మధ్య పరుగులు పెట్టలేక చావాలి.. పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో.. పంజాబ్ బౌలర్ అర్ష్ దీప్ సింగ్ మూడో ఓవర్ చివరి బంతికి దేవదత్ పడిక్కల్ మిడ్ వికెట్ లైన్ లో షాట్ బాదాడు. ఆ బంతిని ఆపడానికి పంజాబ్ ఫీల్డర్ ఎంత దూరం నుంచి పరుగులు పెట్టుకుంటూ వచ్చాడు. చివరి నిమిషంలో బంతిని తన కాలితో ఆపాడు. బౌండరీ రోప్ కు తగలకుండా నిలువరించాడు. చివరికి తన బాడీ బ్యాలెన్స్ ఆపుకోలేక బౌండరీ లైన్ దాటిఅలా వెళ్ళిపోయాడు. మొత్తంగా ఆ ఫీల్డర్ బౌండరీ సేవ్ చేశాడని అందరూ అనుకున్నారు. కానీ వికెట్ల మధ్య దేవదత్ పడిక్కల్ తో కలిసి విరాట్ కోహ్లీ చిరుత మాదిరిగా పరుగులు పెట్టాడు. ఏకంగా నాలుగు పరుగులు తీశాడు. పంజాబ్ ఫీల్డర్ బంతిని బౌండరీ వైపు వెళ్లకుండా ఆపినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అయితే విరాట్ కోహ్లీతో సమానంగా పరుగులు పెట్టలేక దేవదత్ పడిక్కల్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. అన్నట్టు దేవదత్ పడిక్కల్ వయసు 24 సంవత్సరాలు. ఒకరకంగా విరాట్ తో పోల్చి చూస్తే 12 సంవత్సరాలు చిన్నవాడు. అయినప్పటికీ విరాట్ కోహ్లీతో సమానంగా పరుగులు తీయలేకపోయాడు.. విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడి పంజాబ్ బౌలర్ల పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. ఏమాత్రం భయపడకుండా పరుగులు తీసి.. బెంగళూరు అభిమానులను అలరించాడు. యువకులతో పోటీపడి విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ లో పరుగులు తీయడం విశేషం.
KOHLI & PADIKKAL RUNNING FOUR IN A AFTERNOON MATCH pic.twitter.com/L786SgO4yQ
— Johns. (@CricCrazyJohns) April 20, 2025