Homeక్రీడలుక్రికెట్‌RCB vs MI David Funny Incident: ఏమయ్యా డేవిడ్. అంపైర్ మీ ఫ్రెండ్ అనుకున్నావా.....

RCB vs MI David Funny Incident: ఏమయ్యా డేవిడ్. అంపైర్ మీ ఫ్రెండ్ అనుకున్నావా.. బంతితో అలా ఇబ్బంది పెట్టావ్

RCB vs MI David Funny Incident: బెంగళూరు, ముంబై (RCB vs MI)జట్ల మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. బెంగళూరు ఇన్నింగ్స్ సమయంలో ఆ జట్టు ఆటగాడు డేవిడ్ చేసిన పని అంపైర్ కు విపరీతమైన కోపం తెప్పించింది. కొద్దిసేపటి దాకా డేవిడ్ చిన్న పిల్లాడిగా మారిపోయి పిచ్చి చేష్టలకు పాల్పడ్డాడు. దీంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లకు.. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులకు కొద్దిసేపటి దాకా ఏమీ అర్థం కాలేదు.

బెంగళూరు ఇన్నింగ్స్ సమయంలో డేవిడ్ స్ట్రైకర్ గా ఉన్నాడు. 18 ఓవర్ లో హార్దిక్ పాండ్యా బౌలింగ్లో డీప్ మిడ్ వికెట్ మీదుగా డేవిడ్ భారీ సిక్సర్ కొట్టాడు. అతడు కొట్టిన కొట్టుడు బంతి ఆకారం మారిపోయింది. దీంతో కొత్త బంతిని ఇవ్వాల్సిన అవసరం అంపైర్ ల మీద పడింది. దీంతో వారు బంతుల పెట్టిన తెప్పించారు. అందులో ఒక బంతిని తీసుకొని.. ముంబై ఆటగాళ్లకు ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఆ బంతిని డేవిడ్ తీసుకున్నాడు. పదేపదే దానితో ఆటలాడాడు. అంపైర్ ఇవ్వమని అడిగినప్పటికీ.. ఇవ్వడానికి నిరాకరించాడు. అనేక పర్యాయాలు అంపైర్ విజ్ఞప్తి చేసినప్పటికీ చిన్నపిల్లాడి మాదిరిగా ఆటలాడాడు. దీంతో అంపైర్ కొద్దిసేపు కలత చెందాడు. చివరికి డేవిడ్ బంతి ఇచ్చాడు. ఒక నవ్వు నవ్వాడు.

ఆ సమయంలో డేవిడ్ వెంట రోహిత్ శర్మ కూడా ఉన్నాడు. అతడు కూడా ఈ సంఘటన చూసి నవ్వుకున్నాడు.. ఆ తర్వాత డేవిడ్, రోహిత్ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. డేవిడ్ అలా ఎందుకు చేసాడు.. బంతితో ఎందుకు ఆడుకున్నాడు.. అనే ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం లభించలేదు. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందడానికి డేవిడ్ ఇలా చేసి ఉంటాడని.. అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.. అతడు చేసిన పని నవ్వు తెప్పించిందని.. ఇబ్బందితో చిన్న పిల్లాడి మాదిరిగా అతడు ఆడటం విచిత్రంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి..

ఈ మ్యాచ్లో బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ పాటిదర్, సాల్ట్, విరాట్ కోహ్లీ అర్థ శతకాలతో విధ్వంసం సృష్టించారు. ఫలితంగా తమ జట్టుకు నాలుగు వికెట్ల రాష్ట్రానికి 240 పరుగులు అందించారు. సాల్ట్ 36 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల సహాయంతో 78 పరుగులు చేశాడు. కోహ్లీ 38 బంతుల్లో 50 పరుగులు చేశాడు. సాల్ట్, విరాట్ తొలి వికెట్ కు 90 భాగస్వామ్యం నెలకొల్పారు. ఫలితంగా బెంగళూరు జట్టు భారీ స్కోర్ చేయగలిగింది. పాటిధార్ కేవలం 20 బంతుల్లోనే నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 53 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 222/5 వద్ద తన ఇన్నింగ్స్ ముగించింది. ఫలితంగా బెంగళూరు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular