RCB Vs KKR 2025: కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో బీసీసీఐ ఐపీఎల్ ను రీస్టార్ట్ చేసింది. శనివారం నుంచి మళ్లీ మ్యాచులు మొదలు కాబోతున్నాయి.. ఇక టీమిండియా కింగ్ కోహ్లీ సుదీర్ఘ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. దీంతో అతడికి కనివిని ఎరుగని రేంజ్ లో ఫేర్వెల్ ఇవ్వాలని ఫ్యాన్స్ రెడీ అయ్యారు. విరాట్ కోహ్లీ దాదాపు 17 సంవత్సరాల నుంచి ఐపీఎల్లో బెంగళూరు జట్టుకు ఆడుతున్నాడు. అందువల్ల అతడికి ఘనమైన ఫేర్వెల్ ఇవ్వాలని కన్నడ అభిమానులు డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే ఏ ఆటగాడికి దక్కని రేంజ్ లో ఫేర్వెల్ ఇవ్వాలని సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి తమ ప్రణాళికలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. వారి ప్రణాళికలో భాగంగా రూపొందించిన ఒక జెర్సీ మాత్రం ఆకట్టుకుంటున్నది.
Also Read: ఇండియా ఏ టీం ఇదే.. ఇందులో రాణిస్తేనే జాతీయ జట్టుకు.. కరణ్ నాయర్, జురెల్ కి ఛాన్స్
ఇంతకీ ఆ జెర్సీ ఏంటంటే..
విరాట్ కు ఘనమైన ఫేర్వెల్ ఇవ్వడానికి.. శనివారం నాటి కోల్ కతా తో జరిగే మ్యాచ్లో వైట్ జెర్సీలో రావాలని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. ఇందులో బాగానే #269 SIGNINGOFF” స్పెషల్ జెర్సీని రూపొందించారు. అది విపరీతంగా ఆకట్టుకుంటున్నది. దీనిని తెలుపు రంగులో రూపొందించడానికి ప్రధాన కారణం.. విరాట్ కోహ్లీ సుదీర్ఘంగా సాగే ఆటకు లో పర్మినెంట్ రిటైర్మెంట్ తీసుకోవడమే.. ఎందుకంటే రెడ్ బాల్ ఫార్మాట్లో ఆటగాళ్లు వేసుకునే జెర్సీ మొత్తం వైట్ కలర్ లో ఉంటుంది. అందువల్లే బెంగళూరు ఫ్యాన్స్ మొత్తం వైట్ కలర్ జెర్సీ ధరించాలని డిసైడ్ అయ్యారు. ఇక శనివారం చిన్నస్వామి స్టేడియం మొత్తం వైట్ కలర్ లో దర్శనమిస్తుందని తెలుస్తోంది.
బిసిసిఐ ఇవ్వకపోయినా..
కింగ్ కు బీసీసీఐ గ్రాండ్ ఫేర్వెల్ కండక్ట్ చేయకపోయినప్పటికీ.. తాము ముందుగానే ఆ కార్యక్రమం పూర్తి చేస్తామని విరాట్ ఫ్యాన్స్ ముందుకు వచ్చారు. ఇందులో భాగంగానే వారు తెలుపు రంగులో కింగ్ చిత్రాన్ని రూపొందించిన వస్త్రాలు ధరించి కనిపించనున్నారు.. ఎందుకంటే విరాట్ కోహ్లీతో బెంగళూరు ఫ్యాన్స్ కు అవినాభావ సంబంధం ఉంది. ఇంతవరకు బెంగళూరు ఒకసారి కూడా ట్రోఫీ విన్ కాకపోయినప్పటికీ.. విరాట్ అంటే కన్నడ అభిమానులు ప్రాణమిస్తారు. విరాట్ కోహ్లీ ఆట తీరు చూసి మైమరచిపోతారు. అందువల్లేవారు టెస్ట్ క్రికెట్ కు శాశ్వత వీడ్కోలు పలికిన నేపథ్యంలో.. విరాట్ కోహ్లీకి తిరుగులేని స్థాయిలో వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నారు..” మాకు విరాట్ కోహ్లీ అంటే ప్రాణం. అతని ఆట తీరు చూసేందుకు ఎంత దూరమైనా వెళ్తాం. ఈసారి అతడు రెడ్ బాల్ ఫార్మాట్ కు పర్మినెంట్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. అలాంటి ప్లేయర్ కు మా స్థాయిలో మేము ఫేర్వెల్ ఇవ్వాలి. ఎందుకంటే అతడు మా కన్నడ ప్రేక్షకులను రంజింపజేశాడు. మా అభిమానాన్ని చూర కొన్నాడు. అటువంటి వ్యక్తికి మా అభిమానాన్ని కూడా పరిచయం చేయాలి. మా ప్రేమని కూడా వ్యక్తం చేయాలి. మా ఇంటి సభ్యుడిగా విరాట్ కోహ్లీని భావించాలని” విరాట్ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు..
ఆకట్టుకుంటున్న జెర్సీలు
కింగ్ సేవలను గుర్తు చేసుకుంటూ ఫాన్స్ రూపొందించిన వైట్ జెర్సీ ఆకట్టుకుంటున్నది.. ముఖ్యంగా దానిపై” 269 సైనింగ్ ఆఫ్ ” అనే క్యాప్షన్ ఆకర్షిస్తున్నది. విరాట్ బొమ్మ కూడా అద్భుతంగా ఉన్నది. సోషల్ మీడియాలో ఈ ఫోటో విపరీతంగా సర్కులేషన్ లో ఉంది.. చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్లో కన్నడ అభిమానులు ఏ రేంజ్ లో సందడి చేస్తారో చూడాల్సి ఉంది.