RCB Vs DC WPL 2025 Highlights
RCB Vs DC WPL 2025 Highlights: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో ప్లేఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టును 9 వికెట్ల తేడాతో ఓడించింది. డబ్ల్యూపీఎల్ ఇది ఆ జట్టుకు ఐదవ విజయం. ఓపెనర్లు షెఫాలి వర్మ (80 నాటౌట్), జెస్ జోనాసెన్ (61 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును విజయపథంలో నడిపించారు. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా 27 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఆర్‌సీబీకి ఇది వరుసగా నాలుగో ఓటమి.
Also Read: 300 మ్యాచ్‌కు సిద్ధమైన కింగ్ కోహ్లి.. కెరీర్‌లో మరో మైలురాయి.. సువర్ణాధ్యాయం!
డబ్ల్యూపీఎల్ లో జరిగిన చివరి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై ఇండియన్స్‌ను తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కూడా ఆ జట్టు తన విజయపరంపరను కొనసాగించింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున.. షెఫాలీ, జెస్ జోనాసెన్ రెండో వికెట్‌కు 77 బంతుల్లో 146 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 43 బంతుల్లో ఆడిన షఫాలీ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదారు. జోనాస్సెన్ తన 38 బంతుల ఇన్నింగ్స్‌లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. రెండు పరుగులకే కెప్టెన్ మెగ్ లానింగ్ అవుటయ్యారు. ఆర్సీబీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 93 బంతుల్లోనే 151 పరుగులు చేసి ఢిల్లీ లక్ష్యాన్ని ఛేదించింది.
అంతకుముందు.. ఆర్‌సిబి 5 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఎల్లీస్ పెర్రీ 47 బంతుల్లో 3 సిక్సర్లు 3 ఫోర్లతో 60 పరుగులు చేసి ఆర్‌సిబి తొలి గౌరవ ప్రదమైన స్కోర్ చేసేందుకు సహాయపడింది. రాఘవి బిష్ట్ 32 బంతుల్లో 2 సిక్సర్లు కొట్టి 33 పరుగులు సాధించింది. ఇంగ్లాండ్ క్రికెటర్ డాని వాట్ హాడ్జ్ 21 పరుగులు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున శిఖా పాండే, శ్రీ చరణి 28 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టారు. మారిజాన్ కాప్ పటిష్టంగా బౌలింగ్ చేసి 18 పరుగులకు ఒక వికెట్ పడగొట్టింది.
ఈ సంవత్సరం డబ్ల్యూపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఎల్లీస్ పెర్రీ నిలిచింది. అతను ఆరు మ్యాచ్‌ల్లో 98.33 సగటుతో 295 పరుగులు చేసింది. అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ ఆర్సీబీ తన గెలుపు ట్రాక్ లోకి రాలేకపోయింది. టోర్నమెంట్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లను గెలుచుకోవడం ద్వారా ఆర్సీబీకి మంచి ఆరంభం లభించింది. దీని తరువాత జట్టు ట్రాక్ తప్పింది.
మొత్తానికి డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీపై ఘన విజయంతో ఈ ఏడాది ప్లేఆఫ్ చేరుకున్న తొలి టీంగా ఢిల్లీ నిలిచింది. గత రెండు సంవత్సరాల్లో ఫైనల్ చేరిన ఈ జట్టుకు కప్పు మాత్రం దక్కలేదు. మరి ఈ సారైనా మెగ్ లానింగ్ ఆధ్వర్యంలో టీమ్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని గట్టి పట్టుదలతో ఉంది. షఫాలీ ఫాం ఢిల్లీ జట్టుకు కలిసొచ్చే అంశం.
Also Read: చాంపియన్స్ ట్రోఫీలో సెమీ చేరిన సౌత్ ఆఫ్రికా.. ఎవరికి చేటు?