RCB team new record in IPL: అభిమానుల ఆశీస్సులకు తగ్గట్టుగానే బెంగళూరు జట్టు ఆటతీరు కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి బలమైన అడుగులు వేస్తోంది. ఇక ఈ సీజన్లో కీలకమైన మ్యాచ్ బెంగళూరు ఆడుతోంది. ఈనెల 27న లక్నో జట్టుతో బెంగళూరు తలపడుతుంది. ఇందులో గనుక గెలిస్తే బెంగళూరు టాప్ -2 లోకి వెళ్ళిపోతుంది. ఇటీవల మ్యాచ్ లో హైదరాబాద్ చేతిలో బెంగళూరు ఓటమిపాలైంది. ఈ ఓటమి ద్వారా బెంగళూరు పాయింట్లు పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది.. మొత్తంగా లక్నో జట్టుకు మే 27న జరిగే బ్యాచ్ అంతగా ముఖ్యమైనది కాకపోయినాప్పటికీ.. బెంగళూరుకు మాత్రం అది అత్యంత విలువైన మ్యాచ్. ఈ మ్యాచ్లో గెలిచిన దానిబట్టే.. పాటిదార్ సేనకు ఐపీఎల్ ట్రోఫీ గెలిచే అవకాశాలు ఉంటాయి.
Also Read: KL Rahul : నిన్న టెస్ట్ జట్టులో చోటు.. నేడు టి20లో అవకాశం?!; కేఎల్ రాహుల్ పంట పండిందిపో..
ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేకపోయినప్పటికీ బెంగళూరు ఎప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించింది.. సోషల్ మీడియాలో విపరీతమైన అభిమాన బలం ఉండే బెంగళూరు.. సరికొత్త బెంచ్ మార్క్ సృష్టించింది. సామాజిక మాధ్యమాలలో చెన్నై జట్టుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే ఇప్పుడు చెన్నై జట్టును బెంగళూరు బీట్ చేసేసింది. ఇన్ స్టా గ్రామ్ లో 20 మిలియన్ ఫాలోవర్ల పార్క్ అంతకుంది. సరిగా ఏప్రిల్ నెలలో 17.7 మిలియన్ ఫాలోవర్లు చెన్నై జట్టుకు ఉండేవారు. చెన్నై జట్టును బెంగళూరు క్రాస్ చేసింది. 20 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ అందుకుంది.. విరాట్ కోహ్లీకి ఇన్ స్టా గ్రామ్ లో విపరీతంగా ఫాలోవర్స్ ఉంటారు. వారు కూడా ప్రస్తుతం బెంగళూరు జట్టును అనుసరిస్తున్నారు.
” బెంగళూరు ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేదు. కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో దానికి తిరుగులేదు. అందువల్లే సామాజిక మాధ్యమాలలో అభిమానులు విపరీతంగా ఆ జట్టును అనుసరిస్తున్నారు. అందువల్లే చెన్నై జట్టును సైతం అది బ్రేక్ చేసేసింది. చివరికి ఐపీఎల్ ట్రోఫీ అందుకోకముందుకే సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.. ఈ ఐపీఎల్ లో చెన్నై జట్టును ఓడించి బెంగళూరు సరికొత్త రికార్డు సృష్టించింది. దానికి కొనసాగింపు గానే ఇన్ స్టా గ్రామ్ లో అదరగొట్టింది.. ఐపీఎల్ చరిత్రలో 20 మిలియన్ ఫాలోవర్స్ అందుకున్న తొలి జట్టుగా బెంగళూరు నిలిచిందని” నెటిజన్లు పేర్కొంటున్నారు.
Also Read: Sunil Gavaskar: శుభ్‌మన్ గిల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గావస్కర్
బెంగళూరు జట్టు ఈసారి ప్రారంభం నుంచి వరుస విజయాలు అందుకుంది. మధ్యలో కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. వెంటనే తేరుకుంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా.. సూపర్ క్రికెట్ ఆడింది. కొన్ని సందర్భాల్లో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాత కొన్ని స్థానాలు కోల్పోయినప్పటికీ.. మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు టైటిల్ రేసులో ముందుంది. అన్నీ అనుకూలిస్తే బెంగళూరు టైటిల్ గెలుస్తుందనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.