Kakani Govardhan Reddy Arrest: కాకాణి గోవర్ధన్ రెడ్డి కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నెల్లూరు జిల్లా వెంకటగిరి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కాకాణిని నెల్లూరు జైలుకు తరలించనున్నారు. ఆదివారం సాయంత్రం కాకాణిని నెల్లూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఎక్కడ అరెస్ట్ చేశారనే విషయంపై పోలీసులు రెండు రకాలుగా మీడియాలకు సమాచారం ఇచ్చారు. కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఆయన వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంటే అదుపులోకి తీసుకున్నామని మీడియాకు సమాచారం ఇచ్చారు.