Rajinikanth : కొంతమంది హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొన్ని ఇళ్లకే సినిమా ఇండస్ట్రీకి దూరమవుతారు. కానీ ప్రస్తుతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ మాత్రం ఐదు దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. ఈమె ఇప్పటివరకు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా అన్ని భాషలలోనూ దాదాపు ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ హీరోయిన్ తన సినిమా కెరియర్ లో ఒకే ఒక్క హీరోతో మాత్రం ఏకంగా నాలుగు రకాల పాత్రలలో నటించింది. ఈ స్టార్ హీరో సరసన తల్లిగా, చెల్లిగా, ప్రియురాలిగా, అత్తగా నటించింది. సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరో హీరోయిన్ల జంట ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. వాళ్ల కాంబినేషన్లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించాయి. కొన్ని జోడీలకు సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కెరియర్ ప్రారంభంలో హీరోలకు జోడిగా నటించిన హీరోయిన్ ఆ తర్వాత మళ్లీ అదే హీరోకు తల్లిగా, చెల్లిగా అలాగే అత్తగా కూడా నటిస్తుంటారు. ప్రస్తుత మనం చెప్పుకోబోయే హీరోయిన్ సైతం ఒక హీరోకు పలు పాత్రలలో నటించింది.
Also Read : కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్.. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎవరో తెలుసా..
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. తన సినీ కెరియర్లో రజనీకాంత్ ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఏడుపదుల వయసులో కూడా ఆయన చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే హీరో రజినీకాంత్ కు ఒక స్టార్ హీరోయిన్ చెల్లిగా, ప్రియురాలిగా, తల్లిగా అలాగే అత్తగా కూడా నటించింది. ఈమె మరెవరో కాదు దివంగత నటి శ్రీవిద్య. శ్రీవిద్య అతి చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీవిద్య హాస్యనటుడు కృష్ణమూర్తి, ఎమ్మెల్యే నటి వసంతకుమారి దంపతుల కూతురు. శ్రీ విద్యా జన్మించిన ఒక ఏడాదికే ఆమె తండ్రి ఒక ప్రమాదంలో కన్నుమూశారు.
ఈ క్రమంలో శ్రీవిద్య 14 ఏళ్ల చిన్న వయసులోనే తన కుటుంబాన్ని ఆర్థిక సమస్యల నుంచి తగ్గించడానికి సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ్ లో తిరువూరుచల్వన్ అనే సినిమాతో సినిమా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది. అపూర్వ రాగం గల్ సినిమాలో రజనీకాంత్ తో పాటు కమల్ హాసన్ కూడా హీరోగా నటించారు. ఇక ఈ సినిమాలో శ్రీ విద్యా రజనీకాంత్ కు ప్రియురాలిగా నటించింది. ఆ తర్వాత 1989లో మాపిళ్ళై సినిమాలో ఈమె హీరో రజనీకాంత్ కు అత్తగా నటించింది. ఇక తర్వాత రజనీకాంత్ మరియు మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన దళపతి సినిమాలో శ్రీవిద్య రజినీకాంత్ కు తల్లిగా నటించింది. 1993 లో రిలీజ్ అయిన అతుర్వతలి సినిమాలో హీరో రజనీకాంత్ కు చెల్లిగా నటించింది శ్రీవిద్య.
