RCB Storm Into Qualifier 1: ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఓడిపోయింది. దీంతో టాప్ -2 అవకాశాలు కాస్త సంక్లిష్టంగా మారాయి. ఈ క్రమంలో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్లో ఆరు వికెట్ల వ్యత్యాసంతో రాయల్ చాలెంజర్స్ ఘనవిజయం సొంతం చేసుకుంది.
ఈ విజయం ద్వారా బెంగళూరు కోల్ కతా, ముంబై లాంటి జట్లను సులువుగా దాటేసింది. ఏకంగా టాప్ -2 లోకి వెళ్లిపోయింది. పంజాబ్ జట్టుతో అమీ తుమీకి సిద్ధమైంది.
ప్రస్తుత ఐపీఎల్ ఎడిషన్ లో ఆర్సీబీ ఏడుకు ఏడు మ్యాచ్ లు గెలిచింది.
2012లో 8 మ్యాచ్ లు ఏడు గెలిచి కోల్ కతా సత్తా చాటింది.
2012లో రోహిత్ నాయకత్వంలోని ముంబై 8 మ్యాచ్లకు 7 గెలిచి సరికొత్త రికార్డు సృష్టించింది.
మే 19న ఆతిధ్య జట్టుపై హైదరాబాద్ 206 పరుగుల టార్గెట్ ను బ్రేక్ చేసిన తర్వాత.. ఇదే వేదికపై టి20 లలో ఇది రెండవ విజయవంతమైన 200+ చేదన.
2024 లో కోల్ కతా వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్ కతా విధించిన 262 పరుగుల టార్గెట్ ను పంజాబ్ చేదించింది.
హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ విధించిన 246 రన్స్ టార్గెట్ ను హైదరాబాద్ విజయవంతంగా చేదించింది.
2025లో లక్నో వేదికగా లక్నో జట్టు విధించిన 228 రన్స్ టార్గెట్ ను బెంగళూరు విజయవంతంగా చేదించింది.
2020లో షార్జా వేదికగా పంజాబ్ విధించిన 224 రన్స్ టార్గెట్ ని రాజస్థాన్ రాయల్స్ విజయవంతంగా చేదించింది.
2024లో కోల్ కతా వేదికగా జరిగిన మ్యాచ్లో కోల్ కతా విధించిన 224 రన్ టార్గెట్ ను రాజస్థాన్ రాయల్స్ విజయవంతంగా ఛేదించింది.
ఇక ఐపీఎల్ లో 200 కంటే ఎక్కువ పరుగులను చేదించిన జాబితాలో బెంగళూరు సరికొత్త రికార్డులను సృష్టించింది.
లక్నోపై ప్రస్తుత సీజన్లో 228 పరుగుల టార్గెట్ ను చేదించింది.
2011లో జరిగిన సీఎల్ టి20 టోర్నీలో సౌత్ ఆస్ట్రేలియా విధించిన 215 రన్స్ టార్గెట్ ను బెంగళూరు చేదించింది..
2010లో పంజాబ్ జట్టుతో బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో 204 పరుగుల టార్గెట్ ను బెంగళూరు విజయవంతంగా ఫినిష్ చేసింది.
2011లో సి ఎల్ టి 20 టోర్నీలో న్యూ సౌత్ వేల్స్ విధించిన 204 పరుగుల టార్గెట్ ను బెంగళూరు ఈజీగా ఫినిష్ చేసింది.
2024 లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ జట్టు విధించిన 201 పరుగుల టార్గెట్ ను బెంగళూరు సులువుగా చేదించింది.
కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం.. కర్ణాటక అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ జట్టు అభిమానులు ఆకాశమే హద్దుగా సంబరాలు జరుపుకున్నారు. బెంగళూరు ప్లేయర్ల జెర్సీలు ధరించి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తద్వారా తమ అభిమానాన్ని అనితరసాధ్యమైన రీతిలో చాటుకున్నారు.