Homeఎంటర్టైన్మెంట్Junior NTR - Kalyan Ram : ఎన్టీఆర్ ఘాట్ సందర్శించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్...

Junior NTR – Kalyan Ram : ఎన్టీఆర్ ఘాట్ సందర్శించిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వీడియో వైరల్! కారణం ఇదే

Junior NTR – Kalyan Ram : లెజెండరీ యాక్టర్, ప్రజానేత నందమూరి తారక రామారావు జన్మదినం నేడు. ఆయన జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద కోలాహలం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ ని సందర్శిస్తున్నారు. పుష్ప గుచ్ఛాలు ఆయన సమాధిపై ఉంచి నివాళులు అర్పిస్తున్నారు. ఇక ప్రతి ఏడాది క్రమం తప్పకుండా జూనియర్ ఎన్టీఆర్ తాతయ్య జయంతి నాడు ఎన్టీఆర్ ఘాట్ కి వస్తారు. నివాళులు అర్పిస్తారు. ఆయన్ని స్మరించుకుంటూ మౌనంగా కాసేపు ఘాట్ వద్ద కూర్చుంటారు.

షూటింగ్స్ తో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య కళ్యాణ్ రామ్ తో పాటు నేడు ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకున్నారు. తాతయ్యకు నివాళులు అర్పించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ రాకను తెలుసుకున్న అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరారు. ఆయన్ని చూసేందుకు ఎగబడ్డారు. మరోవైపు కడప వేదికగా మహానాడు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాజరు కావడం లేదు. చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో కూడా జూనియర్ పాల్గొనలేదు.

Also Read : కళ్యాణ్ రామ్ కు జూ. ఎన్టీఆర్ ఎందుకు సారీ చెప్పారు.. ఆ కథేంటి?

మరోవైపు ఎన్టీఆర్ వార్ 2, ప్రశాంత్ నీల్ చిత్రాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. మే 20న ఎన్టీఆర్ జన్మదినం కాగా, వార్ 2 టీజర్ విడుదల చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. మాజీ రా ఏజెంట్ కబీర్ ని వెంటాడే ఏజెంట్ గా ఎన్టీఆర్ రోల్ డిజైన్ చేశారు. హృతిక్-ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్ కానున్నాయి. వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

వార్ 2 ఆగస్ట్ 14న థియేటర్స్ లోకి రానుంది. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ చిత్రీకరణ మొదలైంది. ఇది పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా అని సమాచారం. డ్రగ్ మాఫియా నేపథ్యంలో సాగుతుందట. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. డ్రాగన్ అనే టైటిల్ ప్రచారం అవుతుంది. ఎన్టీఆర్ కి జంటగా రుక్మిణి వసంత్ నటిస్తుంది. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్స్ లోకి రానుంది.

RELATED ARTICLES

Most Popular