Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అరుదైన రికార్డు సృష్టించాడు. ప్రపంచ క్రికెట్లో ఈ ఘనతను అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. టి20 లలో హైయెస్ట్ వికెట్లు తీసిన బౌలర్ గా అతడు ఆవిర్భవించాడు. దక్షిణాఫ్రికా వేదికగా ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా 20 లీగ్ జరుగుతోంది. ఈ లీగ్ లో ఎం ఐ కేప్ టౌన్ జట్టుకు రషీద్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో పార్ల్ రాయల్స్ జట్టుతో జరిగిన ఓ మ్యాచ్లో రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. తద్వారా టి20 లలో (అంతర్జాతీయం + లీగ్) లలో కలిపి మొత్తం 633 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఇందులో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తరుపున 161.. మిగిలిన 472 వికెట్లను డొమెస్టిక్, వివిధ లీగ్ లలో పడగొట్టాడు.. వైవిధ్యమైన బంతులు వేస్తూ… బ్యాటర్లను ఇబ్బంది పెట్టడంలో రషీద్ ఖాన్ సిద్ధహస్తుడు. అందువల్లే అతడికి మిస్టీరియస్ బౌలర్ అనే పేరు ఉంది. తన ఈ బౌలింగ్ ద్వారానే ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు అతడు అద్భుతమైన విజయాలను కట్టబెట్టాడు. ఇక ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మనదేశంలోనూ అధికంగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులకు రషీద్ ఖాన్ సుపరిచితుడు.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున చాలా రోజులు ఆడాడు. ఇప్పుడు అతడు ఐపిఎల్ లో గుజరాత్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అత్యధిక వికెట్ల తీసిన బౌలర్ గా రషీద్ ఖాన్ ఆవిర్భవించాడు.. 461 మ్యాచ్లలో 18.08 సగటుతో ఈ ఘనతను అతడు అందుకున్నాడు.
రషీద్ ఖాన్ కంటే ముందు వెస్టిండీస్ మాజీ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో 582 మ్యాచులలో 24.40 సగటుతో 631 వికెట్లు సొంతం చేసుకున్నాడు..” అసలు నేను ఇలా బౌలింగ్ చేస్తానని కలలో కూడా ఊహించలేదు. అద్భుతమైన బంతులు నా చేతుల నుంచి వచ్చాయి. గొప్ప గొప్ప ఆటగాళ్లు నా బౌలింగ్ ఎదుర్కోలేక అవుట్ అయ్యారు. ఇలాంటి దృశ్యాలు చూసిన తర్వాత నాకు గొప్పగా అనిపిస్తుంది. ఇన్ వికెట్లు పడగొట్టానా అనే ఆశ్చర్యం కలుగుతోంది. ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో నా పేరు మొద్దు వరుసలో ఉండడం గొప్పగా ఉంది..బ్రేవో సూపర్బ్ బౌలర్. టి20లలో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లెక్కకు మిక్కిలి వికెట్లు పడగొట్టాడు. అతడు నాకు ఎప్పుడూ ఆదర్శంగానే ఉంటాడు. నాకు సోదరుడు లాంటివాడు. అతడి బౌలింగ్ చూసి నేను చాలా నేర్చుకున్నా. నన్ను నేను మార్చుకోవడంలో అతడి బౌలింగ్ ఎంతగానో ఉపకరించింది. అలాంటి ఆటగాడి రికార్డును అధిగమించడం గొప్పగా అనిపిస్తోంది. కాకపోతే అతడు అత్యుత్తమమైన బౌలర్. ఎలాంటి మైదానంపై నైనా బంతులు వేస్తాడు. ఎలాంటి ఆటగాడినైనా అతడు ముప్పు తిప్పలు పెడతాడు. అందువల్లే అతడు ప్రపంచంలోనే అద్భుతమైన బౌలర్ గా కొనసాగుతున్నాడు. అతడి రికార్డును నేను అధిగమించానంటే నమ్మ లేకపోతున్నాను. వచ్చే రోజుల్లోనూ ఇలాంటి ప్రదర్శన చేయాలని భావిస్తున్నాను. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టుకు మెరుగైన సేవలు చేయాలని యోచిస్తున్నాను. చివరి వరకు క్రికెట్ ఆడుతూనే ఉంటాను. ఎందుకంటే క్రికెట్ తప్ప నాకు వేరే ధ్యాస తెలియదని” రషీద్ ఖాన్ వ్యాఖ్యానించాడు.