Rashid Khan: ప్రపంచంలోనే బెస్ట్ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్న రషీద్ ఖాన్…పాకిస్తాన్ సూపర్ లీగ్ ( పి ఎస్ ఎల్) కి ఇయర్ దూరంగా అవుతున్నట్టుగా తెలియజేశాడు. ఇక ఇప్పటికే ఆయన వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నాడు.దాంతో తనకి కొంత రెస్ట్ కావాలనే ఉద్దేశ్యం తోనే తను ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక మార్చ్ లో ఐపీఎల్ అలాగే అది ముగిసిన వెంటనే టి20 వరల్డ్ కప్ ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడితే తనకి రెస్ట్ లేకుండా వరుసగా మ్యాచ్ లను ఆడాల్సి ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ సూపర్ లీగ్ కి ఈ ఇయర్ తను దూరమవుతున్నట్టుగా తెలుస్తుంది.
అయితే పాకిస్తాన్ లీగ్ ఆడే కంటే ఐపిఎల్ ఆడితే తనకి ఎక్కువ అనుభవం వస్తుందని, టి 20 వరల్డ్ కప్ కి ముందు ప్రాక్టీస్ అవుతుందని తను భావిస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక ఈ ఉద్దేశ్యం తోనే తను పాకిస్తాన్ సూపర్ లీగ్ ని పక్కన పెట్టినట్టు గా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి పిఎస్ఎల్ స్టార్ట్ అయి ఐపీఎల్ స్టార్ట్ అయ్యే సమయానికి ముగుస్తుంది. రషీద్ ఖాన్ ఆడాలనుకుంటే పి ఎస్ ఎల్, ఐపీఎల్ రెండు ఆడొచ్చు కానీ పాకిస్తాన్ లీగ్ ఆడే కంటే ఐపీఎల్ ఆడితే ఎక్కువ అనుభవం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంలోనే తన ఐపిఎల్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు గా తెలుస్తుంది.
ఇక ఐపీఎల్ లో తను ‘గుజరాత్ టైటాన్స్ ‘ టీం కి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే పిఎస్ఎల్ లో ‘లాహోర్ క్వాలెండర్’ టీం కి వహిస్తున్నాడు. గత రెండు సీజన్ లలో రషీద్ ఖాన్ కీలక పాత్ర వహించాడు.ఇక ఈ సీజన్ లో తన అభిమాన ప్లేయర్ ఆడటం లేదు అని తెలుసుకున్న లాహోర్ టీం అభిమానులు తీవ్రమైన నిరాశని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇది ఇలా ఉంటే ఐర్లాండ్ తో ఆడే 2 టెస్ట్ లు, 3 వన్డేలు, 3 టి మ్యాచ్ లకు అందుబాటులో ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అవి ముగిసిన వెంటనే ఐపిఎల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దఐపిఎల్ లో జాయిన్ అవ్వాలని చూస్తున్నాడు. ఇక ఇది చూసిన చాలామంది ఇండియన్స్ మాత్రం రషీద్ ఖాన్ ఐపిఎల్ కోసమే పిఎస్ఎల్ ని వదిలేశాడు అని కామెంట్స్ చేస్తున్నారు…