Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2024 జనవరి 27 శనివారం ఓ రాశి వారు శత్రువులతో పోటీని ఎదుర్కొంటారు. మరికొందరికి అనుకూల వాతావరణం. ఈరోజు ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సందర్భంగా మేషం నుంచి మీనం వరకు 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
ఇతరులకు అప్పులు ఇవ్వకండి. ఉద్యోగులు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఇతరుల సలహాలు తీసుకోవాలి.
వృషభం:
గతంలో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. స్నేహితులు, సోదరుల మద్దతు ఉంటుంది. అనవసర గొడవల్లోకి తలదూర్చొద్దు. లేకపోతే మీరు కష్టపడినదానికి ఫలితం ఉండదు.
మిథునం:
కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించాలి.
కర్కాటకం:
వివాదాలకు దూరంగా ఉండాలి. శత్రువులతో పోటీని ఎదుర్కోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన ఒడిదొడుకులు ఎదుర్కోంటారు. ప్రియమైరన వారితో సంతోషంగా ఉంటారు.
సింహ:
కొన్ని శుభవార్తలు వింటారు. మీ ఆలోచనలతో ఇతరులు జీవితాల్లో మార్పులు వస్తాయి. కొందరి సలహాలతో ప్రయోజనాలు పొందుతారు. మీ భాగస్వామితో ఆనందంగా ఉంటారు.
కన్య:
మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడుతారు. ఉద్యోగులు కార్యాలయాల్లో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు.
తుల:
ఇప్పటి వరకు చేపట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. అయితే కొన్ని విషయాల్ల ఓపిక ఉండాలి. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం.
వృశ్చికం:
వ్యాపారులకు ప్రతికూల వాతావరణం. ఏ విషయాన్నైనా నిర్ణయం తీసుకునే ముందు ఇతరుల సలహాలు తీసుకోవాలి. ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది.
ధనస్సు:
ప్రత్యర్థులతో ఇబ్బందులు పడుతారు. అయితే ఒత్తిడికి గురి కాకుండా ముందుకు వెళ్లాలి. ఉద్యోగులకు సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి.
మకర:
ఉద్యోగులకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. భాగస్వామి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమయాన్ని వృథా చేయకుండా అన్ని పనులు పూర్తి చేసుకోవాలి.
కుంభం:
పాత వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. కొత్త వ్యక్తులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందగా ఉంటారు.
మీనం:
పెట్టుబడుల విషయంలో చాకచక్యంగా వ్యవహరించాలి. చిన్నచిన్న సమస్యలు మానసికంగా బాధను కలిగించవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది.