Ranji Trophy
Ranji Trophy: తాజాగా జరుగుతున్న 2024–25 రంజీ ట్రోఫీలో ముంబై జట్టుకు షాక్ తగిలింది. జమ్మూ కశ్మీర్ జట్టు చేతిలో ముంబై ఓడిపోయింది. శరద్‌పవార్ క్రికెట్ స్టేడియం వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాలో జమ్మూ కశ్మీర్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 205 పరుగుల లక్ష్యాన్ని కశ్మీర్ జట్టు 5 వికెట్లు కోల్పోయి గెలిచింది. జమ్మూ కశ్మీర్ బ్యాట్స్ మెన్స్‌లో శభమ్ ఖజూరియా(45) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. వివ్రంత్(38), అబిద్ ముస్తాక్(32 నాటౌట్) రాణించాడు. ముంబై బౌలర్లలో షామ్స్ ములానీ నాలుగు వికెట్ల పడగొట్టాడు. ప్రస్తుత సీజన్‌లో జమ్మూకు ఇది నాలుగో విజయం.
మూడో రోజు ఆట..
274/7 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడోరోజు ఆట ప్రారంభించిన ముంబై తన రెండో ఇన్నింగ్స్‌లో 290 పనుగులకు ఆలౌట్ అయింది. ముంబై బ్యాట్స్‌మెన్‌లలో శార్దూల్ ఠాకూర్(119) సెంచరీ చేశాడు. మనీశ్ కొటియడ్(62) రాణించాడు. మిగతా బ్యాట్స్ ఉమెన్‌లో తనీష్ కొటియన్(62) రాణించాడు. మిగితా బ్యాటర్లంతా నిరాశపరిచారు. కాగా జమ్మూ కాశ్మీర్ తమ తొలి ఇన్నింగ్స్ లో 206 పరుగులకు ఆలౌట్ కాగా.. ముంబై తమ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 120 పరుగులకే కుప్పకూలింది.
నిరాశపరిచిన రోహిత్ శర్మ..
పదేళ్ల తర్వాత తొలిసారి రంజీ మ్యాచ్ ఆడిన టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మ నిరాశపర్చాడు. ఈ మ్యాచ్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహించిన రోహిత్.. రెండో ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 19 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 28 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ బాటలోనే యశశ్వి జౌస్వాల్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్ కూడా విఫలమయ్యారు. రోహిత్ కారణంగానే ముంబై ఓడిపోయింది. రోహిత్ కోసం అద్బుతమైన ఫామ్‌లో ఉన్న ఆయుష్‌ను పక్కన పెట్టారు. ఇది ముంబై సెలక్టర్లు చేసిన తప్పని మాజీలు పేర్కొంటున్నారు. ఆయుష్ మాత్రం ప్రస్తుత సీజన్‌లో దుమ్మ లేపుతున్నాడు. కేవలం 5 మ్యాచ్‌లలో 441 పనుగులు చేశాడు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Ranji trophy shock for mumbai in ranji jammu and kashmir stunning victory
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com