IPL 2024: మరికొద్ది గంటల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది. ప్రారంభ మ్యాచ్ బెంగళూరు, చెన్నై మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నైలోనే చిదంబరం స్టేడియం ముస్తాబయింది. ఇంకా ఐపీఎల్ ప్రారంభం కాకముందే రాజస్థాన్ జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్, ఆస్ట్రేలియన్స్ స్పిన్నర్ ఆడం జంపా వైదొలిగాడు. వ్యక్తిగత కారణాల వల్లే అతడు నిష్క్రమించాడని తెలుస్తోంది. గత సీజన్లో జంపా రాజస్థాన్ జట్టు తరఫున ఆరు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అయినప్పటికీ అతడిని కొనసాగిస్తూ రాజస్థాన్ నిర్ణయించింది. నిన్నటి వరకు అతడు ఆడతాడని.. రాజస్థాన్ ప్రకటించింది. అయితే అనూహ్యంగా అతడు ఈ టోర్నీలో ఆడటం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని జంపా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత సీజన్లో జంపాను రాజస్థాన్ కోటిన్నరకు కొనుగోలు చేసింది. అతడు ఆరు మ్యాచ్లు మాత్రమే ఆడినప్పటికీ ఈ సీజన్లోనూ కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది.
గత ఏడాది భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో జంపా విశేషంగా రాణించాడు. ఆస్ట్రేలియా తరఫున అత్యధికంగా వికెట్లు పడగొట్టాడు. 11 మ్యాచులు ఆడిన అతడు 23 వికెట్లు తీశాడు.. ఇటీవల ఆస్ట్రేలియా తరఫున న్యూజిలాండ్ పర్యటనలో పాల్గొన్నాడు. తనదైన ప్రతిభ చూపించాడు. బిగ్ బాస్ లీగ్ లోనూ జంపా ఆడాడు.
ఇక రాజస్థాన్ రాయల్స్ జట్టులో రవిచంద్రన్ అశ్విన్, చాహల్ ప్రధాన స్పిన్నర్లు గా ఉన్నారు. గత సీజన్లో అశ్విన్, చాహల్ 35 వికెట్లు తీశారు. అయితే వీరిద్దరికీ జంపా తోడైతే బాగుంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అనుకోకుండా అతడు గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో రాజస్థాన్ జట్టు మేనేజ్మెంట్ సందిగ్ధంలో పడింది. ఇప్పటికే గాయం కారణంగా పేసర్ ప్రసిద్ద కృష్ణ తోడి నుంచి నిష్క్రమించాడు. అతని స్థానంలో మరో బౌలర్ ను రాజస్థాన్ ఇంతవరకూ తీసుకోలేదు.. దానిని మర్చిపోకముందే జంపా నిష్క్రమించడం రాజస్థాన్ జట్టును తీవ్రంగా ఇబ్బందికి గురిచేస్తోంది.
ప్రస్తుత రాజస్థాన్ జట్టు ఇది
సంజు సాంసంన్, బట్లర్, హిట్మేయర్, యశస్వి జైస్వాల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, చాహల్, పరాగ్, నవదీప్ షైనీ, ధృవ్ జురెల్ , బౌల్ట్, డోనో వన్, కులదీప్ సేన్, కునాల్ రాథోడ్, ఆవేశ్ ఖాన్, పావెల్, దూబే, కోహ్లర్ కాడ్ మోర్, ముస్తాక్, నాంద్రే బర్గర్.