Homeఎంటర్టైన్మెంట్Om Bhim Bush Twitter Talk: ఓం భీమ్ బుష్ ట్విట్టర్ టాక్: ఆడియన్స్ నుండి...

Om Bhim Bush Twitter Talk: ఓం భీమ్ బుష్ ట్విట్టర్ టాక్: ఆడియన్స్ నుండి ఊహించని రెస్పాన్స్, హిట్టా ఫట్టా?

Om Bhim Bush Twitter Talk: బ్రోచేవారెవరురా మూవీతో హిట్ కాంబోగా పేరు తెచ్చుకున్నారు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. ఈ కాంబినేషన్ ని మరోసారి రిపీట్ చేశారు. ఓం భీమ్ బుష్ మూవీ మార్చి 22న విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ ముగిసిన నేపథ్యంలో టాక్ బయటకు వచ్చింది. మరి ఈ కమెడియన్స్ ట్రియో నవ్వులు పూయించారా? ఆడియన్స్ రెస్పాన్స్ ఏమిటీ? అనేది చూద్దాం.

ఓం భీమ్ బుష్ కథ విషయానికి వస్తే.. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ మిత్రులు. కష్టపడకుండా హాయిగా బ్రతకాలనే స్వభావం కలిగినవారు. యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేసి శాస్త్రవేత్తలు కావాలని అనుకుంటారు. అయితే వీరి అల్లరి చిల్లర వేషాలు నచ్చని ప్రొఫెసర్ శ్రీకాంత్ అయ్యంగార్ యూనివర్సిటీ నుండి తరిమేస్తాడు. దాంతో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ భైరవకొండ అనే ఊరు వెళతారు. అక్కడ వాళ్లకు ఊహించని సంఘటనలు ఎదురవుతాయి? ఈ ముగ్గురు మిత్రులు తమ పీహెచ్డీ పూర్తి చేశారా? భైరవకొండ లోగల పురాతన బిల్డింగ్ లో ఏం జరిగింది? అనేది మిగతా కథ…

కేవలం కామెడీ ప్రధానంగా ఓం భీమ్ బుష్ తెరకెక్కించాడు దర్శకుడు శ్రీహర్ష కొనుగంటి. ఈ క్రమంలో ఆయన సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. ఎప్పటిలాగే శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కామెడీ పంచులు బాగానే పేలాయి. కొన్ని కామెడీ ఎపిసోడ్స్ విపరీతంగా నవ్విస్తాయి. కాంటెంపరరీ కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. సినిమా మొత్తం వారి సన్నివేశాలతో నిండిపోయి ఉంటుంది.

ఈ సినిమాలో కథ అంటూ చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. జాతిరత్నాలు మూవీ మాదిరి కేవలం కామెడీ పంచులు, ఎపిసోడ్స్ ఆధారంగా తెరకెక్కించారు అనిపిస్తుంది. బ్రోచేవారెవరురా మూవీలో అంతర్లీనంగా రెండు కథలు నడుస్తాయి. అదే సమయంలో కామెడీ ప్రధానంగా ఉంటుంది. ఓం భీమ్ బుష్ మూవీలో కథ, లాజిక్స్ ఏమీ ఉండవు. ఈ క్రమంలో మూవీ సాగతీతకు గురైన భావన కలుగుతుంది. లాజిక్స్ వదిలేసి కామెడీ ఎంజాయ్ చేయడమే అంటున్నారు ఆడియన్స్. మొత్తంగా సినిమాకు మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీని ఇష్టపడేవారు సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేస్తారు.

RELATED ARTICLES

Most Popular