Homeక్రీడలుక్రికెట్‌Rajasthan Vs Gujarat: రాజస్థాన్ ఓడిపోయేదే.. అతడి మ్యాజిక్ తోనే గుజరాత్ కు ఎదురు దెబ్బ

Rajasthan Vs Gujarat: రాజస్థాన్ ఓడిపోయేదే.. అతడి మ్యాజిక్ తోనే గుజరాత్ కు ఎదురు దెబ్బ

Rajasthan Vs Gujarat: ఐపీఎల్ లో రాజస్థాన్ వరుసగా రెండో మ్యాచ్లో కూడా గెలిచేసింది. పంజాబ్ జట్టుతో సమానంగా నిలబడింది. ఇటీవల చెన్నైలో జరిగిన మ్యాచ్లో అద్భుతమైన విజయాన్ని సాధించిన రాజస్థాన్.. అదే ఊపును గుజరాత్ మీద కొనసాగించింది. చెన్నై జట్టును చెన్నైలో.. గుజరాత్ జట్టును అహ్మదాబాద్ లో ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది రాజస్థాన్.

Also Read: ప్రదీప్ రంగనాథన్ ‘LIK’ మూవీ మొట్టమొదటి రివ్యూ.. ఇలాంటి కాన్సెప్ట్ తో ఇండియాలో ఇదే తొలి సినిమా..

రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసి 210 పరుగులు చేసింది. జై స్వాల్ 55, సూర్య వంశీ 31, జురెల్ 75, పరాగ్ 8, హిట్ మేయర్ 18 పరుగులు చేశారు. రబాడ రెండు వికెట్లు పడగొట్టాడు. అశోక్ శర్మ, ప్రసిద్ధి కృష్ణ, రషీద్ ఖాన్, సిరాజ్ తలా ఒక వికెట్ సాధించారు.

ఆ తర్వాత ఇన్నింగ్స్ మొదలు పెట్టిన గుజరాత్ దూకుడుగా బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సాయి సుదర్శన్ (73) మెరుపు వేగంతో ఆడాడు. గిల్ స్థానంలో వచ్చిన కుషాగ్ర 18 పరుగులు చేశాడు. ఈ దశలో బట్లర్ (26) విఫలమయ్యాడు. సుందర్ (4) కూడా చేతులెత్తేశాడు.. రాహుల్ తేవాటియ (12), షారుక్ ఖాన్ (11) విఫలమయ్యారు. చివర్లో రషీద్ ఖాన్ (24), రబాడ (23*) రాజస్థాన్ బౌలర్లను భయపెట్టినప్పటికీ గుజరాత్ జట్టుకు విజయాన్ని మాత్రం అందించలేకపోయారు.

ఒకానొక దశలో గుజరాత్ జట్టు 127/2 వద్ద ఉన్నది. దీంతో గుజరాత్ విజయం ఖాయమని అందరూ అనుకున్నారు.. రాజస్థాన్ బౌలర్లు కూడా డీలా పడిపోయారు.. ఈ దశలో రవి బిష్ణోయ్ రంగంలోకి దిగాడు. తను ఒకే ఓవర్లో ఫిలిప్స్ (3), వాషింగ్టన్ సుందర్ (4) ను పెవిలియన్ పంపించాడు. బర్గర్ చేతిలో బట్లర్ అవుట్ అయ్యాడు. దీంతో గుజరాత్ ఒక్కసారిగా తిరోగమనంలో పడింది. ఈ క్రమంలో రాహుల్ తేవాటియ కూడా రవి బౌలింగ్లో అవుట్ అయ్యాడు. షారుక్ ఖాన్ నిర్లక్ష్యమైన పరుగుతో అయ్యాడు. దీంతో 127/2 నుంచి 161/7 కి పడిపోయింది. రషీద్ ఖాన్, రబాడా చివర్లో మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశారు. జట్టుకు విజయాన్ని అందించడానికి ప్రయత్నించారు. ఇక చివరి రెండు ఓవర్లలో గుజరాత్ విజయానికి 15 పరుగులు కావాల్సి వచ్చింది.

19ఓవర్ లో ఆర్చర్ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో రాజస్థాన్ దాటిలో ఆశలు చిగురించాయి. ఇక చివరి ఆరు బంతులకు 11 పరుగులు కావలసిన సమయంలో.. తుషార్ అద్భుతంగా బౌలింగ్ వేశాడు. నాలుగు బంతులలో మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఐదవ బంతికి రషీద్ భారీ షాట్ కొట్టాడు. డీప్ పాయింట్ లో ఉన్న ఆర్చర్ ఆ బంతిని క్యాచ్ అంటున్నాడు. చివరి బంతికి రన్ రాకపోవడంతో రాజస్థాన్ వరుసగా రెండవ విజయాన్ని అందుకుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular