https://oktelugu.com/

Asia Cup 2023 Final: ఫైనల్ మ్యాచ్ కి అడ్డంకి గా మారిన వర్షం…ఈ మ్యాచ్ జరగపోతే గెలుపెవరిది అంటే..?

రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక భారీ ప్లానింగ్ తో బరిలోకి దిగుతుంది అనే విషయం అయితే స్పష్టం గా తెలుస్తుంది... మొన్న సూపర్ 4 జరిగిన మ్యాచ్ మాదిరిగానే ఇండియా లోని టాప్ ఫోర్ బ్యాట్స్ మెన్స్ ని తొందరగా పెవిలియన్ కి పంపించాలని శ్రీలంక ప్లేయర్లు ప్లాన్స్ వేస్తున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : September 16, 2023 / 05:13 PM IST

    Asia Cup 2023 Final

    Follow us on

    Asia Cup 2023 Final: చాలా రోజుల నుంచి ఆడుతున్న ఏషియా కప్ చివరి దశ కి చేరుకుంది.బాంగ్లాదేశ్ పాకిస్థాన్ లాంటి టీం లు ఇంటికి వెళ్లిపోగా ఇండియా శ్రీలంక టీం లు మాత్రం ఫైనల్ కి చేరుకున్నాయి.ఇండియా శ్రీలంక రెండు టీములు కూడా రేపు ఫైనల్ పోరు లో డు ఆర్ డై మ్యాచ్ గా ఫైనల్ మ్యాచ్ ని ఆడటానికి సిద్ధం అయ్యాయి.ఈ మ్యాచ్ కొలంబో లోని ప్రేమదాస స్టేడియం లో జరగుతుంది. ఈ ఏషియా కప్ లో ఆడిన ప్రతి మ్యాచ్ కి వర్షం అడ్డంకి గా మారుతూనే వస్తుంది ఇక రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ కి కూడా వర్షం పడే అవకాశం పుష్కలంగా ఉంది.ఇక ఈ మ్యాచ్ కి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ని కూడా కన్ఫర్మ్ చేసారు.అంటే ఆదివారం రోజు మ్యాచ్ కి వర్షం అంతరాయం కల్గిస్తే ఆ మ్యాచ్ సోమవారం రోజున మళ్లీ కంటిన్యూ అవుతుంది.అయితే చాలా మంది కి ఉన్న పెద్ద డౌట్ ఏంటి అంటే ఆదివారం, సోమవారం రెండు రోజులు కూడా వర్షం పడితే ఈ మ్యాచ్ పరిస్థితి ఏంటి అనేది చాలా మంది లో ఉన్న డౌట్ అయితే రెండు రోజులు వర్షం పడి మ్యాచ్ రద్దు చేసే పరిస్థితి కనక వస్తే రెండు టీంలను విజేతలు గా ప్రకటిస్తారు…2002 వ సంవత్సరం లో కూడా ఇలాగె ఒకేసారి జరిగింది అప్పుడు రెండు టీంలను విజేతలు గా ప్రకటించారు…

    ఇక ఇది ఇలా ఉంటె రేపు జరిగే ఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక భారీ ప్లానింగ్ తో బరిలోకి దిగుతుంది అనే విషయం అయితే స్పష్టం గా తెలుస్తుంది… మొన్న సూపర్ 4 జరిగిన మ్యాచ్ మాదిరిగానే ఇండియా లోని టాప్ ఫోర్ బ్యాట్స్ మెన్స్ ని తొందరగా పెవిలియన్ కి పంపించాలని శ్రీలంక ప్లేయర్లు ప్లాన్స్ వేస్తున్నారు అలా అయితేనే శ్రీలంక టీం గెలవగలదు అనేది వాళ్ళకి కూడా తెలుసు.ఇక ఇది కుదరని పక్షాన కోహ్లీ ని చాలా తొందరగా అవుట్ చేయాలనీ చూస్తున్నారు. దానికోసమే వెల్లలాగే ని మరోసారి బరిలోకి దింపుతున్నారు…మరి వెల్లలాగే ని ఎదురుకోవడం లో ఇండియన్ బ్యాట్స్ మెన్స్ ఎంత వరకు విజయం సాధిస్తారో చూడాలి…

    ఇక శ్రీలంక ప్లానింగ్స్ లో శ్రీలంక ఉంటె ఇండియా ప్లానింగ్స్ లో ఇండియా ఉంది…ఇండియా ప్లానింగ్ ఏంటంటే ముందు వీళ్ళమీద ఎక్కువ స్కోర్ చేయాలి, ఆ తర్వాత శ్రీలంక బ్యాట్స్ మెన్స్ ని తొందర గా అవుట్ చేయాలి దానికోసమే ఇండియా ఒక సూపర్ ప్లాన్ వేసుకొని మరి బరిలోకి దిగుతున్నట్టు గా తెలుస్తుంది…ఎవరి ప్లాన్స్ ఫలిస్తాయో తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు వెయిట్ చేయక తప్పదు…