Pushpa 2: పుష్ప 2 లో అల్లు అర్జున్ తమ్ముడిగా ఆ స్టార్ హీరో… మైండ్ బ్లాక్ చేసే న్యూస్!

వీటన్నింటికీ మించిన మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం తమిళ స్టార్ హీరో కార్తీని ఎంపిక చేశారట.

Written By: Shiva, Updated On : September 16, 2023 5:09 pm

Pushpa 2

Follow us on

Pushpa 2: పుష్ప మూవీ గురించి వస్తున్న ఒక్కో అప్డేట్ మైండ్ బ్లాక్ చేస్తుంది. ఇటీవల ఈ చిత్ర సెట్స్ నుండి కొన్ని ఫోటోలు, వీడియోలు లీక్ అయ్యాయి. అవి సినిమా ఓ రేంజ్ లో ఉంటుందనే హింట్ ఇస్తున్నాయి. వందల కొద్దీ లారీలు ఓ చోట పార్క్ చేశారు. పుష్ప 2 క్లైమాక్స్ సన్నివేశం కొరకే ఆ లారీలు అంటూ ప్రచారం జరిగింది. ఇక అల్లు అర్జున్ మీద ఇంస్టాగ్రామ్ ప్రతినిధులు ఓ స్పెషల్ వీడియో చేశారు. అందులో కొన్ని సన్నివేశాలు, అల్లు అర్జున్ లుక్ రివీల్ చేశారు.

వీటన్నింటికీ మించిన మైండ్ బ్లోయింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం తమిళ స్టార్ హీరో కార్తీని ఎంపిక చేశారట. పుష్ప 2లో నటించేందుకు కార్తీ సైతం ఎస్ చెప్పారట. పుష్పరాజ్ కి తమ్ముడిగా కార్తీ పాత్ర ఉంటుందని అంటున్నారు. కార్తీ సన్నివేశాలు సైతం గూస్ బంప్స్ కలిగేలా ఉంటాయట. ఈ మేరకు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.

అదే నిజమైతే పుష్ప చిత్రానికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. బన్నీకి తమిళ్ లో కొంచెం క్రేజ్ తక్కువ. అక్కడ పుష్ప 2ని మార్కెట్ చేసేందుకు కార్తీ ప్రెజెన్స్ ఉపయోగపడుతుంది. తెలుగులో కూడా కార్తీకి అభిమానులు ఉన్నారు. ఇక కేరళలో అక్కడి హీరోలకు సమానంగా అల్లు అర్జున్ కి ఫేమ్ ఉంది. పుష్ప 1 నార్త్ ఇండియాలో పాప్యులర్ చేసింది.

పుష్ప 2తో ఇండియా వైడ్ షేక్ చేయాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాలనేది ప్లాన్. ఆల్రెడీ పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులకు వెయ్యి కోట్ల ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. 2024 ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక రోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.