IPL Last ball six: చిరవి ఓవర్ లోని చివరి రెండు బంతులకు పన్నెండు పరుగులు కావాల్సి వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. బ్యాటింగ్ చేస్తున్నది ఎంత పెద్ద లెజెండరీ అయినా.. తడబడతాడు కదా. ఆ సమయంలో ఉండే ఉత్కంఠ అంతా ఇంతా కాదు. నరాలు తెగే టెన్షన్ ఉంటుంది. బ్యాట్స్ మెన్ కొడతాడా లేదా అన్న టెన్షన్ తో గ్రౌండ్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. అయితే ఇలాంటి సందర్భాలను రెండు సార్లు చేసి చూపించారు ఇద్దరు గొప్ప బ్యాట్స్ మెన్స్.
ఒకప్పుడు ధోనీ ఈ ఫీట్ చేసి చూపిస్తే.. నిన్న రాహుల్ తెవాటియా దీన్ని సాధించి ఔరా అనిపించాడు. ఈ సీజన్ ఐపీఎల్‌లో ఇదే అత్యంత ఉత్కంఠ భరితమైన మ్యాచ్ గా మిగిలింది. నిన్న పంజాబ్‌కు, గుజరాత్ టైటాన్స్ కు మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ మాత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 189పరుగులు చేసింది.
భారీ లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టైటాన్స్ హోరా హోరా పోరును కొనసాగించింది. ఒకసారి పంజాబ్ చేతిలోకి మ్యాచ్ వెలితే మరోసారి.. గుజరాత్ చేతిలోకి వచ్చింది. ఇలా రెండు జట్ల నడుమ దోబూచులాడిన విజయం.. చివరకు తెవాటియా దెబ్బకు గుజరాత్ సరసన వచ్చి నిలబడింది. థ్రిల్లర్ మూవీలా సాగిన హోరాహోరీ పోరులో.. చివరి ఓవర్ రెండు బంతులకు పన్నెండు పరుగులు కావాల్సి ఉంది.
అయితే బ్యాటింగ్ లో ఉన్నది తెవాటియా. బౌలింగ్ వేస్తున్నది ఒడెన్ స్మిత్. ఈ ఇద్దరి చేతిలోనే బ్యాచ్ గెలుపు ఆధారపడి ఉంది. గెలిపించిన వారు హీరో అవుతారు.. ఓడిపోయిన వారు విలన్ అవుతారు. అయితే ఈ సమయంలో ఒత్తిడిని జయించి తెవాటియా అద్భుతంగా ఆడాడు. ఆఖరి రెండు బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు బాదేసి జట్టును గెలిపించాడు. దీంతో గుజారత్ ఆనందానికి అవధుల్లేవు.
Also Read: తాగిన మైకంలో ఆ క్రికెటర్ నన్ను అలా చేశాడు: చాహల్ సంచలన వ్యాఖ్యలు
ఇదే ఫీట్‌ను 2016 ఐపీఎల్ సీజన్ లో ధోనీ చేసి చూపించాడు. ఆ సమయంలో పుణే సూపర్ జెయింట్స్ కు అలాగే పంజాబ్ కు మధ్య మ్యాచ్ జరిగింది. ఆ సమయంలో ఛేదనకు దిగిన పుణె తరఫున ధోనీ ఉన్నాడు. చివరి ఓవర్లో 23 పరుగులు కావాల్సి ఉంది. అక్షర్ పటేల్ వేస్తున్న బౌలింగ్ లో మొదటి నాలుగు బంతులను వరుసగా సిక్స్, ఫోర్ తో పాటు ఓ వైడ్ బాల్ వచ్చింది. దీంతో 11 రన్స్ వచ్చాయి. చివరి రెండు బంతులకు 12పరుగులు కావాలి. అంటే ఆ రెండు బంతులను కూడా సిక్స్ కొడితేనే విన్ అవుతుంది. దీంతో మహేంద్రుడు మాయ చేశాడు. రెండు బంతులను కూడా సిక్స్ గా మలిచేసి విజయం సాధించాడు ధోనీ.