IPL 2023: టి20 క్రికెట్ అంటే యువ ప్లేయర్లకు మాత్రమే అని అంతా భావిస్తారు. ఒక వయసు దాటిన తర్వాత సీనియర్ ప్లేయర్లు ఈ ఆట నుంచి తప్పుకోవడం చూస్తుంటాం. యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించి వారిలోని ప్రతిభను వెలికి తీసే గొప్ప వేదికగా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ చూస్తుంటాం. అయితే అటువంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో యువర్ క్రికెటర్లకు పోటీగా సీనియర్ క్రికెటర్లు చెలరేగిపోతున్నారు. లేటు వయసులోనూ ఘాటు ప్రదర్శనతో.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఐపీఎల్ 16వ ఎడిషన్ ఉత్సాహంగా సాగుతోంది. ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ వరకు వెళ్తోంది. దీంతో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ అభిమానులను మునివేళ్లపై నిలబెట్టేలా చేస్తోంది. 35 ఏళ్ల వయసు దాటిన వారు యువ క్రికెటర్లకు పోటీగా, అంతకంటే మించి అన్నట్టుగా ప్రదర్శన చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తాము ఆడుతున్న జట్లకు మెరుగైన ప్రదర్శనతో విజయాలను అందించి పెడుతున్నారు. ఈ సీనియర్ ప్లేయర్ల ప్రదర్శనతో అభిమానులు ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అదరగొడుతున్న వెటరన్ ప్లేయర్స్..
ఐపీఎల్-2023 లో సగం మ్యాచ్ లు పూర్తయ్యేసరికి ఫాఫ్ డు ప్లెసిస్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టాప్ లో ఉన్నాడు. వచ్చే జూలై నాటికి 39 ఏళ్ల వయసుకి చేరుకోబోతున్నాడు. ఈ వయసులోనూ అద్భుతమైన ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ సీజన్ లో మూడో వ్యక్తిగత టాప్ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచిన శిఖర్ ధావన్ వయసు 37 ఏళ్లు. 99 పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు ఒక మ్యాచ్ లో. ఈ సీజన్ లో ఇదే మూడో వ్యక్తిగత అత్యధిక స్కోర్. ఇక ఈ సీజన్లోనే అత్యధిక స్ట్రైక్ రేటుతో ఆడుతున్న ఆటగాడు అజంక్య రహానే వయసు 35 ఏళ్లు. 199.4 స్ట్రైక్ రేటుతో అదరగొడుతున్నాడు ఈ వెటరన్ ప్లేయర్. అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో టాప్ లో నిలిచాడు 34 ఏళ్ళ వయసున్న పియూస్ చావ్లా. ఏడు మ్యాచ్ ల్లో 11 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు ఈ వెటరన్ ప్లేయర్.
ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితాలో వెటరన్ ప్లేయర్స్..
ఐపీఎల్ 2023 సీజన్ లో సగం మ్యాచ్ లు పూర్తయ్యేసరికి ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితాలో నలుగురు వెటరన్ ప్లేయర్స్ ఉండడం గమనార్హం. ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితాలో ఏడు మ్యాచ్లో 405 పరుగులు చేసిన ఫాఫ్ డు ప్లెసిస్ 498.4 ఇంపాక్ట్ పాయింట్లతో ఈ టేబుల్ లో అగ్రస్థానంలో ఉన్నాడు. మరో ఆటగాడు శిఖర్ ధావన్ నాలుగు మ్యాచ్లో 233 పరుగులు చేసి 277.2 లతో ఈ టేబుల్ లో స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే అజంక్య రహానే ఐదు మ్యాచ్ ల్లో 209 చేసి పరుగులు 279.9 ఇంపాక్ట్ పాయింట్ల ఈ టేబుల్ లో స్థానాన్ని దక్కించుకున్నాడు. తీరు సేవల ఏడు మ్యాచ్ ల్లో 11 వికెట్లు తీసి 373.4 ఇంపాక్ట్ పాయింట్లతో ఈ టేబుల్ లో చోటు దక్కించుకున్నాడు. అద్భుతంగా రాణిస్తున్న శిఖర్ ధావన్ దురదృష్టవశాత్తు గడిచిన మూడు మ్యాచ్ ల్లో అందుబాటులో లేకుండా పోయాడు. లేకపోతే మరింత అదరగొట్టేవాడిని పలువురు పేర్కొంటున్నాను.
లేటు వయసులో చెలరేగిపోతున్న ఆటగాళ్లు..
లేటు వయసులో చెలరేగిపోతున్నారు ఆటగాళ్లు. ఫాఫ్ డు ప్లెసిస్ ఈ సీజన్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు. 165.3 స్ట్రైక్ రేట్ తో 405 పరుగులు చేశాడు. ఎంవీపీ లిస్టులో టాప్ లో నిలిచాడు. దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురై గడిచిన మూడు మ్యాచ్ల్లో అందుబాటులో లేకుండా పోయిన శిఖర్ ధావన్ కూడా టోర్నీలో టాప్ పెర్ఫార్మెన్స్ ఆటగాళ్లలో ఒకడిగా నిలిచాడు. అజంక్యా రహనే ఐదు ఇన్నింగ్స్ లో నాలుగు సార్లు 30 పైగా రన్స్ చేసి 160 పైగా స్ట్రైక్ రేట్ సాధించాడు. ఇందులో రెండుసార్లు 60కి పైగా పరుగులను 200కు పైగా స్ట్రైక్ రేటు తో సాధించినవి ఉన్నాయి. రహానే 55.99% ఇంపాక్ట్ ఇప్పటి వరకు జరిగిన ఇన్నింగ్స్ లో ఉంది. రహానే ఐపిఎల్ కెరీర్ లోనే ఇదే బెస్ట్ అని చెబుతున్నారు. చావ్లా కూడా అదే రీతిలో అదరగొడుతున్నాడు. 2019 నుంచి 2021 మధ్యలో 21 మ్యాచ్ ల్లో 17 వికెట్లు తీశాడు చావ్లా. కానీ ఈ సీజన్ లో ఏడు మ్యాచ్లోనే 11 వికెట్లు తీసి అదరగొడుతున్నాడు. దీంతో ఐపీఎల్ యువ క్రికెటర్లకు మాత్రమే కాదని.. తమను తాము నిరూపించుకునేందుకు వెటరన్ ప్లేయర్స్ కు దక్కుతున్న గొప్ప అవకాశంగాను పలువురు చెబుతున్నారు.
Web Title: Rahane chawla mishra and others make a surprise comeback in ipl 2023
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com