Green Peas Benefits: మన ఆరోగ్య పరిరక్షణలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఆహార శైలిలో మార్పులు లేకపోవడంతో రోగాలు రావడానికి కారకులమవుతున్నాం. పాతికేళ్లకే జబ్బుల బారిన పడుతున్నాం. ఫలితంగా జీవితాంతం మందులు మింగుతూ కాలం వెళ్లదీస్తున్నాం. ఈ నేపథ్యంలో మన ఆహారంలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. మంచి పోషకాలు ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది.
ఈ నేపథ్యంలో పచ్చి బఠాణీలు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ప్రొటీన్లు మన శరీరానికి జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి. వీటిని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ,బి, సి, ఇ లు ఉన్నాయి. దీంతో మనకు ఎన్నో లాభాలు కలిగిస్తాయి. ఇంకా ఫైబర్, పొటాషియం, జింక్ ఉండటం వల్ల కూరలకు మంచి రుచిని కలిగిస్తాయి.
శీతాకాలంలో పచ్చి బఠాణీలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి. ఫోలిక్ యాసిడ్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. నియాసిన్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతాయి. పచ్చి బఠాణీలను వారంలో కనీసం మూడు సార్లయినా తింటే ఎన్నో రకాల జబ్బుల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
విటమిన్ బి6 విటమిన్ సి తో ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పచ్చిబఠాణీలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో పచ్చి బఠాణీలను రోజు తీసుకున్నా మంచి జరుగుతుందని చెబుతున్నారు. చూడటానికి పచ్చగా అందంగా కనిపించే పచ్చి బఠాణీలను ఆహారంలో భాగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.