https://oktelugu.com/

APSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. వెంటనే త్వరపడండి*

ప్రయాణికులకు బంపర్ ఆఫర్. టికెట్ చార్జీల ధర తగ్గిస్తూ ఏపీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన నగరాల మధ్య తిరిగే బస్సులకు ఇది వర్తింపజేయనుంది. అయితే కేవలం ఏసీ బస్సులకు.. అది కూడా డిసెంబర్ 1 నుంచి 10వ తేదీ వరకు మాత్రమే.

Written By:
  • Dharma
  • , Updated On : November 28, 2024 / 11:25 AM IST

    APSRTC(1)

    Follow us on

    APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల్లో టికెట్ ధరలపై ఆఫర్ ప్రకటించింది. శీతాకాలం కావడంతో ఏసీ బస్సులకు ఆదరణ తగ్గింది. దీంతో ప్రయాణికులకు ఆకర్షించేందుకు రాయితీ ఇస్తోంది ఏపీఎస్ ఆర్టీసీ. డిసెంబర్ 1 నుంచి 10 వరకు ఈ ఆఫర్ వర్తించనుంది. కొన్ని బస్సుల్లో టిక్కెట్ ధరపై 20 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. రాను పోను ప్రయాణానికి సంబంధించి ఒకేసారి రిజర్వేషన్ చేసుకుంటే అన్ని బస్సుల చార్జీలకు సంబంధించి పది శాతం రాయితీని కూడా ప్రకటించారు. కేవలం బస్సుల ఆక్యుపెన్సి పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా చలి విపరీతంగా ఉంది. దీంతో బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. దీంతో ఆర్టీసీకి నష్టం వచ్చేలా ఉంది. అందుకే ఏసీ బస్సుల చార్జీలను 10 నుంచి 20 శాతం వరకు తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది.

    * చలి కారణంగా తగ్గిన రద్దీ
    తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి కారణంగా ఏసీ బస్సుల్లో ప్రయాణానికి ప్రజలు పెద్దగా ఇష్టపడడం లేదు. అందుకే ఓ పది రోజుల పాటు టిక్కెట్లలో రాయితీ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ.బస్సుల్లో నిండిన సీట్ల సంఖ్యను బట్టి చార్జీలను డిసెంబర్ నెల కు మాత్రమే వర్తించేలా.. చార్జీలు తగ్గించాలని నిర్ణయించారు.తాజా నిర్ణయంతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. చార్జీల తగ్గింపు నిర్ణయ అధికారాన్ని జిల్లా ఇన్చార్జిగా ఉన్న టిపిటివోలకు అప్పగించారు.

    * ఈ రూట్లలో
    ప్రధానంగా విజయవాడ నుంచి హైదరాబాద్,విశాఖపట్నం, బెంగళూరు మధ్య నడిచే ఏసీ బస్సుల్లో చార్జీలను తగ్గిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఆది, శుక్రవారం లో మాత్రం ఎటువంటి చార్జీల తగ్గింపు ఉండదు. విజయవాడ నుంచి హైదరాబాద్ మధ్య తిరిగే డాల్ఫిన్ క్రూయిజ్, అమరావతి బస్సుల్లో టికెట్ చార్జీ 10% మేర తగ్గించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. విజయవాడ నుంచి బెంగళూరు మధ్య తిరిగి వెన్నెల స్లీపర్, అమరావతి బస్సుల్లో టికెట్ చార్జీ 20 శాతం తగ్గించారు. విజయవాడ బెంగళూరు వెన్నెల ఏసి స్లీపర్ బస్సుల్లో చార్జి 2170 రూపాయల నుంచి.. 1770 రూపాయలకు తగ్గించారు. విజయవాడ నుంచి బెంగళూరు మధ్య నడిచే అమరావతి ఏసీ బస్సుల చార్జీ 1870 రూపాయలు కాగా.. దానిని 1530 రూపాయలకు తగ్గించారు. విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే అన్ని అమరావతి ఏసీ బస్సుల్లో చార్జీ 10% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది కేవలం పది రోజులు మాత్రమే.