PV Sindhu : పీవీ సింధు కొంతకాలంగా ఐటీ ప్రొఫెషనల్ వెంకట దత్త సాయితో అనుబంధం కొనసాగిస్తోంది. అతనితో కలిసి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. వీరిద్దరి వివాహానికి ఇరుపక్షాల కుటుంబ సభ్యులు అంగీకారం తెలిపారు. ఇటీవల ఆ విషయాన్ని సింధు తన అధికారిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది . ఆ తర్వాత వెంకట దత్త సాయి, పీవీ సింధు తమ శుభలేఖలను పంచడం మొదలుపెట్టారు. డిసెంబర్ 22న వీరిద్దరి వివాహం రాజస్థాన్లో జరగనుంది. ఒకరోజు గ్యాప్ తర్వాత డిసెంబర్ 24న వీరిద్దరికి రిసెప్షన్ నిర్వహిస్తారు. హైదరాబాదులో జరిగే ఈ వేడుకలో పలువురు ప్రముఖులు పాల్గొంటారు. శనివారం జరిగిన ఎంగేజ్మెంట్ వేడుకలో వెంకట దత్త సాయి, పీవీ సింధు కేక్ కట్ చేసి మీడియాలో పంచుకున్నారు..” మనకు ఒకరి ప్రేమ దక్కిన సమయంలో.. కచ్చితంగా ప్రేమను తిరిగి ఇవ్వాలని” ఎంగేజ్మెంట్ ఫోటోలకు పీవీ సింధు క్యాప్షన్ జత చేసింది. ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాలలో సందడిగా మారాయి. పీవీ సింధు దంపతులకు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
దత్త సాయి నేపథ్యం ఏంటంటే..
పీవీ సింధుకు కాబోయే వరుడు పేరు దత్త సాయి. అతడు ఐటి ప్రొఫెషనల్. పొసిడెక్స్ టెక్నాలజీస్ అనే కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. వెంకట దత్త సాయి కుటుంబానికి, పీవీ సింధు కుటుంబానికి చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. వారిద్దరూ ఒకరికి ఒకరు నచ్చడంతో.. పెద్దలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పీవీ సింధు, వెంకట దత్త సాయి వివాహం ద్వారా వీరిద్దరి కుటుంబాల మధ్య బంధం మరింత బలోపేతం కానుంది. వీరిద్దరి వివాహం రాజస్థాన్లో డిసెంబర్ 22న జరగనుంది. డిసెంబర్ 20 నుంచి సింధు ఇంట్లో ముందస్తు పెళ్లి వేడుకలు జరపనున్నారు. రాజస్థాన్ లో వివాహ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. 24న హైదరాబాదులో జరిగే వివాహ రిసెప్షన్ కూడా గ్రాండ్ గా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, పీవీ సింధు జనవరి నుంచి వరుసగా టోర్నీలు ఆడనుంది. అందువల్లే ఆమె కుటుంబం వివాహాన్ని డిసెంబర్లో నిర్వహిస్తున్నది. గత కొంతకాలంగా సింధు ఫామ్ లో లేదు. గాయాలు కూడా ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఈ దశలో వెంకట దత్త సాయి ఆమెలో స్ఫూర్తిని నింపాడు. ఆమె ఆడిన ప్రతి టోర్నీకి వెళ్ళాడు. ఆమెలో లోపాలను నిర్భయంగా బయటికి చెప్పాడు. దీంతో పివి సింధు మునుపటి ఫామ్ అందుకుంది. రాకెట్ వేగంతో దూసుకు వెళ్లింది. ఫలితంగా ఇటీవల టోర్నీలో విజేతగా నిలిచింది. తనను స్ఫూర్తి నింపిన వెంకట దత్త సాయిని భాగస్వామిగా చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే అతడిని వివాహం చేసుకుంటున్నది.