PV Sindhu Wedding: ఒలింపిక్స్ లో రెండుసార్లు మెడల్స్ సాధించింది. ఇటీవల పారిస్ ఒలంపిక్స్ లో ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. గోల్డ్ మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగినప్పటికీ.. విజయవంతం కాలేక పోయింది. నిరాశతో వెనుదిరిగింది. అంతకుముందు కొన్ని టోర్నీలలోనూ సింధు ఆ స్థాయిలో ఆడ లేకపోయింది. వరుసగా వైఫల్యాలతో విమర్శలను మూటగట్టుకుంది. ఈ దశలోనే ఆమెకు గౌరవెల్లి వెంకట దత్త సాయి పరిచయం అయ్యాడు. అతను వారి దూరపు బంధువుల అబ్బాయి. హైదరాబాద్ త్రిబుల్ ఐటీ లో చదువుకున్నాడు. వాళ్ల నాన్న జీటీ వెంకటేశ్వరరావు ఏర్పాటుచేసిన పోసిడెక్స్ టెక్నాలజీస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు. సింధుకు ఒక స్నేహితుడి లాగా ధైర్యం చెప్పాడు. కష్టకాలంలో భరోసా ఇచ్చాడు. సానుకూల దృక్పథాన్ని నింపాడు. ప్రాక్టీస్ కు కాస్త విరామం ఇచ్చి అప్పుడప్పుడు సినిమాలకు తీసుకెళ్లాడు. ఆమెలో ఉన్న ఒత్తిడిని తగ్గించాడు. అలా సింధులో ఉన్న నిరాశవాదాన్ని పూర్తిగా దారి మళ్ళించాడు. సింధు దగ్గర కావలసినంత డబ్బు ఉంది. లెక్కలేనంత కీర్తి ఉంది. కానీ జీవితాంతం తోడుగా ఉండే వ్యక్తి మాత్రమే లేడు.. ఇప్పుడు ఆమెకు 29 సంవత్సరాలు.. తన తోటి ఆటగాళ్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ పెళ్లిళ్లు చేసుకున్నారు. వివాహ బంధాన్ని ఆస్వాదిస్తున్నారు. ఎటోచ్చి సింధు మాత్రమే ఒంటరిగా ఉంది. దత్త సాయి తనపై చూపిస్తున్న ఆప్యాయతకు సింధు కరిగిపోయింది. వెంటనే అతడితో ఏడడుగులు వేయడానికి ఒప్పుకుంది.
టోర్నీ గెలిచింది
దత్త సాయి కొంతకాలంగా సింధు ఆడుతున్న మ్యాచ్ లకు హాజరయ్యాడు. ఆమె ఓడిపోయినప్పుడు బాధపడ్డాడు. కానీ ఆమెలో చైతన్యాన్ని నింపడంలో మాత్రం వెనకడుగు వెయ్యలేదు. స్ఫూర్తిని రగిలించడంలో ముందు వరసలోనే ఉన్నాడు. గంటలు గంటలు మాట్లాడకుండా.. ఒక ప్రేక్షకుడిగా మ్యాచ్ చూస్తూ ఆమె చేసిన తప్పులను ఎత్తి చూపకుండా.. సున్నితంగా వివరించాడు. ఫలితంగా సయ్యద్ మోడీ టోర్నీలో సింధు విజయం సాధించింది. ఒకప్పటి తన పాత ఫాం ను ప్రదర్శించింది. మైదానంలో లేడి పిల్లలాగా కదిలింది. ఎక్కడ కూడా లోపాలకు తావు ఇవ్వకుండా శివంగిలాగా ప్రత్యర్థులపై విరుచుకుపడింది. డబుల్ ఫాల్ట్ లకు అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. దీంతో సింధు తనను తాను పునరావిష్కరించుకుంది. ఈ క్రమంలో దత్త సాయితో జీవితాన్ని పంచుకోవడానికి సింధు అంగీకరించింది. జనవరిలో సింధుకు విపరీతమైన బిజీ షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో.. సింధు, దత్త సాయి కుటుంబ సభ్యులు డిసెంబర్ 22న రాజస్థాన్లోని ఉదయపూర్ ప్రాంతంలో వివాహం చేయడానికి నిర్ణయించారు. డిసెంబర్ 24న హైదరాబాదులో రిసెప్షన్ జరపనున్నారు. అయితే ఈనెల 20 నుంచి సింధు ఇంట్లో పెళ్లి కార్యక్రమాలు షురూ అవుతాయి. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Pv sindhu is getting married on december 22
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com