Punjab and Delhi : పాకిస్తాన్ దేశానికి హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులో ఉంటుంది. ధర్మశాల మైదానం కూడా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. క్రికెట్ ను మరింతగా అభివృద్ధి చేసేందుకు ఈ రాష్ట్రంలో ఉన్న ధర్మశాల మైదానంలో మ్యాచులు నిర్వహించేందుకు ఐపీఎల్ నిర్వాహక కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఒక మ్యాచ్ నిర్వహించింది. ఇక ఈ క్రమంలో పంజాబ్, ఢిల్లీ జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్ కు ధర్మశాల మైదానాన్ని సిద్ధం చేశారు. రెండు జట్లకు సంబంధించిన ప్లేయర్లు అక్కడ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. అయితే ఇంతలోనే బుధవారం తెల్లవారుజామున భారత్ పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యగా కేంద్ర పౌర విమానయాన శాఖ పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న విమానాశ్రయాలను మూసివేసింది. అందులో ధర్మశాల విమానాశ్రయం కూడా ఉంది. అయితే ధర్మశాల విమానాశ్రయం మూసివేయడంతో గురువారం ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పరిస్థితి ఏమిటనేది అంతుపట్టలేదు. దీనిపై మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. అయితే దీనిపై ఐపీఎల్ నిర్వాహక కమిటీ స్పందించింది. మీడియాలో ప్రసారమవుతున్న ఊహగానాలకు చెక్ పెట్టింది.
Also Read : అనుకోకుండా బోర్డర్ దాటిన బీఎస్ఎఫ్ జవాన్.. పాక్ చేతిలో బందీ
షెడ్యూల్ ప్రకారమే..
గురువారం ధర్మశాల మైదానంలో జరగాల్సిన పంజాబ్, ఢిల్లీ జట్లకు సంబంధించిన మ్యాచ్ విషయంలో నెలకొన్న సందిగ్ధతను ఐపీఎల్ నిర్వాహక కమిటీ తొలగించింది. మ్యాచ్ నిర్వహించుకోవచ్చని ఐపీఎల్ నిర్వాహక కమిటీకి కేంద్రం సూచించింది. అయితే ఇదే మైదానంలో ఈనెల 11న జరగాల్సిన పంజాబ్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ ను ముంబై నగరానికి మార్చింది. అయితే ఎప్పుడు నిర్వహిస్తారు అనే విషయాన్ని మాత్రం బీసీసీ క్లారిటీ ఇవ్వలేదు. అయితే దీనికి సంబంధించి త్వరలోనే ఒక తేదీ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. పౌర విమానయాన శాఖ ధర్మశాలలోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేయడంతో పలు విమానాలు మూతపడ్డాయి.. దీంతో పంజాబ్, ఢిల్లీ మధ్య గురువారం జరగాల్సిన మ్యాచ్ వాయిదా పడుతుందని అందరూ అనుకున్నారు. అయితే ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ నిర్వహణకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ధర్మశాల విమానాశ్రయం తాత్కాలికంగా మూసివేతకు గురి కావడంతో చాలావరకు విమానాలు రద్దు అయ్యాయి. అయితే ఈ విమానాశ్రయాన్ని తిరిగి ఎప్పుడు తెరుస్తారనే విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ స్పష్టత ఇవ్వలేదు.. మొత్తంగా చూస్తే సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గిన తర్వాతే ఈ విమానాశ్రయాన్ని తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ధర్మశాల మైదానంలో ఇటీవల ఓ మ్యాచ్ నిర్వహించారు. అందులో ముంబై జట్టు విజయం సాధించింది.
Also Read: కశ్మీర్ కొండల్లో నక్కిన ఉగ్రవాదులు.. గుర్తించిన అత్యాధునిక నిఘా కెమెరాలు..