Punjab and Bangalore final match : ఐపీఎల్ చివరి అంచె మ్యాచ్ జరుగుతున్న సమయంలో రికార్డు స్థాయిలో జియో హాట్ స్టార్ యాప్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కేలా చేశారు. ఈ కథనం రాసే సమయం వరకు జియో హాట్ స్టార్ లో 43 కోట్ల మంది మ్యాచ్ చూస్తున్నారు. ఒక రకంగా ఐపీఎల్ చివరి అంచె పోటీలలో ఇది ఒక ఒక రికార్డు అని క్రికెట్ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల క్వాలిఫైయర్ -2 మ్యాచ్ నిర్వహించే సమయంలో వర్షం ఇబ్బంది పెట్టింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ నిర్వహణను కాస్త పొడిగించారు. అనుకున్న సమయానికంటే మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. ఆలస్యంగానే ముగిసింది. అప్పటికి సమయం 11;30 దాటింది. అంత లేట్ నైట్ అవర్స్ లోనూ జియో హాట్ స్టార్ లో కోట్ల మంది మ్యాచ్ వీక్షించారు. ఒకానొక సమయంలో లైవ్ మ్యాచ్ వీక్షించే వారి సంఖ్య ఏకంగా 36 కోట్లను దాటిపోయింది. వాస్తవానికి అది ఒక రికార్డుగా స్థిరపడింది. అయితే దానిని ఫైనల్ మ్యాచ్ అధిగమించింది. ఏకంగా 43 కోట్లతో ఫైనల్ మ్యాచ్ సరికొత్త రికార్డు సృష్టించింది.
ఇక బార్క్ డాటా ప్రకారం గత సీజన్లో మొదటి 26 మ్యాచ్లను 44.8 కోట్ల మంది వీక్షకులు వీక్షించారు. ఐపీఎల్ చరిత్రలో అదొక రికార్డుగా నమోదయింది.. గత సీజన్లో టెలివిజన్ ద్వారా 18,800 కోట్ల నిమిషాలు ఐపీఎల్ వీక్షణగా నమోదయింది.. ఇక ఈ సీజన్లో బెంగళూరు, కోల్ కతా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను 41.7 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు ఇదే రికార్డుగా కొనసాగింది. ఇక బెంగళూరు, చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను 37.4 కోట్ల మంది వీక్షించారు. బెంగళూరు, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ను 34.7 కోట్ల మంది వీక్షించారు. ఇక ఫైనల్ మ్యాచ్ లో ఇప్పటివరకు 43 కోట్ల మంది లైవ్లో వీక్షిస్తున్నారు. పీక్ అవర్స్ లో ఈ సంఖ్య 45 కోట్లను చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ అది కనుక అంతకుమించి అనే రేంజ్ కు పెరిగిపోతే మాత్రం.. సరికొత్త రికార్డు నమోదవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
హాట్ స్టార్ లో మ్యాచ్లు ఫ్రీగా చూసే అవకాశం ఉండడంతో వీక్షకుల సంఖ్య పెరుగుతుందని తెలుస్తోంది. పైగా ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడం.. అపరిమితమైన డాటా సౌకర్యం ఉండడంతో ఐపీఎల్ చూసే వారి సంఖ్య పెరుగుతోంది. దీనికి తోడు ఐపీఎల్ నిర్వాహక కమిటీ వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండడంతో.. మ్యాచ్ లకు విపరీతమైన ఆదరణ లభిస్తున్నది. మైదానంలో లైవ్లో మ్యాచ్ చూసే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మైదానాలన్నీ అభిమానులతో కిక్కిరిసి పోయి కనిపిస్తున్నాయంటే.. మనదేశంలో ఐపీఎల్ కు ఏ స్థాయిలో ఆదరణ ఉందో అర్థం చేసుకోవచ్చు.