spot_img
Homeక్రీడలుక్రికెట్‌Punjab Kings IPL 2026: సర్పంచ్ సాబ్ కు ఏమైంది.. పంజాబ్ జట్టుకు ఈసారీ నిరాశేనా

Punjab Kings IPL 2026: సర్పంచ్ సాబ్ కు ఏమైంది.. పంజాబ్ జట్టుకు ఈసారీ నిరాశేనా

Punjab Kings IPL 2026: పంజాబ్ జట్టు ఈ ఐపీఎల్ సీజన్లో ప్రారంభంలో వరుసగా విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంది. దీంతో ఆ జట్టు ప్లే ఆఫ్ వెళ్లడం దాదాపు ఖాయమని అందరూ అనుకున్నారు. 230+ కు మించిన పరుగుల లక్ష్యాన్ని చేదించిన క్రమంలో పంజాబ్ జట్టు కచ్చితంగా ప్లే ఆఫ్ వెళ్తుందని.. గత సీజన్లో కోల్పోయిన ట్రోఫీని.. ఈసారి అందుకుంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు.

పంజాబ్ జట్టు కు దిష్టి తగిలిందో.. జట్టు ఆటగాళ్లకు ఏమైందో తెలియదు గాని.. వరుసగా ఓటములు ఎదురవుతున్నాయి. గెలవాల్సిన తరుణంలో ఓడిపోతున్న ఆ జట్టు చివరికి ప్లే ఆఫ్ అవకాశాలను కూడా సంక్లిష్టం చేసుకుంది. గురువారం ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఓడిపోవడంతో మరింత ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తోంది. పంజాబ్ జట్టు ఇంకా రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ రెండిట్లో గెలిస్తేనే పంజాబ్ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలుంటాయి.

పంజాబ్ జట్టు ఖాతాలో ప్రస్తుతం 13 పాయింట్లు ఉన్నాయి. ఆ జట్టు నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా రెండు మ్యాచులు పంజాబ్ జట్టు ఆడాల్సి ఉంది. అవి రెండు గెలిస్తేనే పంజాబ్ ప్లే ఆఫ్ వెళ్తుంది. అందులో ఒక్క మ్యాచ్లో ఓడినా సరే.. పంజాబ్ జట్టు పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ప్లే ఆఫ్ వెళ్లాలంటే ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాలి. ముంబై జట్టుతో ఓడిపోవడం పట్ల పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

ఈ మ్యాచ్ లో కూటమి తర్వాత పంజాబ్ జట్టు సారధి కీలక వ్యాఖ్యలు చేశాడు. “ఈ ఫలితం ఒక చేదు జ్ఞాపకం” అంటూ వ్యాఖ్యానించాడు. వాస్తవానికి పంజాబ్ జట్టు ఇలా వరుసగా ఓడిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఎందుకంటే ఆ జట్టు బ్యాటింగ్లో బలంగా ఉంది. బౌలింగ్లో కూడా అదే స్థాయిలో ఉంది. అలాంటప్పుడు ఆ జట్టు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఐకమత్యం లేకపోవడం. కొంతమంది ఆటగాళ్లు నిర్లక్ష్యమైన షాట్ లు ఆడి వికెట్లు పడేసుకుంటున్నారు. బౌలింగ్ కూడా సరిగా ఉండడం లేదు. కీలక దశలో దారుణంగా పరుగులు ఇస్తున్నారు. ఫీల్డింగ్ కూడా చెప్పుకోదగిన స్థాయిలో లేదు. అందువల్లే పంజాబ్ జట్టు దారుణంగా ఓటములు ఎదుర్కొంటున్నది. తదుపరి రెండు మ్యాచ్లలో పంజాబ్ జట్టు సత్తా చూపించి.. ప్రారంభంలో ఆడినట్టుగా ఆడితే తిరుగు ఉండదు. ఒకవేళ విఫలమైతే పంజాబ్ జట్టు గ్రూప్ దశ నుంచి ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.

ఈ సీజన్లో పంజాబ్ జట్టు వరుసగా ఐదు విజయాలు నమోదు చేసింది. ఆ తర్వాత వరుసగా ఓటములను ఎదుర్కొన్నది. 2022లో హైదరాబాద్ జట్టు కూడా ఇటువంటి రికార్డు నమోదు చేసింది. ముంబై తో గురువారం జరిగిన మ్యాచ్లో చెన్నై జట్టు చివరి మూడు ఓవర్లలో 50 పరుగులు చేసింది. దీనిని బట్టి పంజాబ్ బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా పంజాబ్ జట్టు బౌలింగ్ మారాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆ జట్టుకు నిరాశ తప్పదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular