Prithvi Shaw- Nidhi Tapadia: భారత జట్టు యంగ్ ప్లేయర్ పృధ్వి షా మరోసారి వార్తల్లో నిలిచాడు. అద్భుతమైన ఆట తీరుతో ఐపీఎల్ లో అదరగొట్టే ఈ యంగ్ క్రికెటర్.. బయట కూడా అంతే ఉత్సాహంగా ఉంటాడు. ఈ క్రమంలోనే మోడల్ నిధి తపాడియాతో కొంతకాలంగా ప్రేమ వ్యవహారాన్ని పృథ్వీ షా నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ విడిపోయినట్లు గత కొంత కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చేలా వీరిద్దరూ చేసిన పనులు కనిపిస్తున్నాయి. ఇన్ స్టాగ్రామ్ లో వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో కావడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తుండగా.. ఇద్దరూ విడిపోయేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం తెలిసిన చాలా మంది క్రికెట్ అభిమానులు పృథ్వి షా ఆట కంటే వివాదాలు, ఇతర వార్తల్లోనూ ఎక్కువగా నిలుస్తూ.. కెరీర్ నాశనం చేసుకుంటున్నాడు అంటూ విమర్శిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో క్రికెటర్లు ఆటకంటే ఇతర వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఐపీఎల్ తర్వాత ఎక్కువ మంది క్రికెటర్లకు సెలబ్రిటీ హోదా వచ్చింది. సెలబ్రిటీ హోదాతోపాటు ఆర్థికంగాను స్థిరపడడంతో ఇతర వ్యాపకాల్లో ఆటగాళ్లు నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలోనే భారత జట్టు యంగ్ ప్లేయర్ పృథ్వీ షా కూడా బయట వ్యాపకాలపై దృష్టి సారించాడు. అందులో భాగంగానే మోడల్ నిధి తపాడియాతో ప్రేమ వ్యవహారాన్ని నడిపించాడు. అయితే, ప్రస్తుతం ఈ ప్రేమ వ్యవహారం పెటాకులు అయినట్లు తెలుస్తోంది. వీరిద్దరికీ కొద్ది రోజుల కిందట నుంచి చెడిపోవడంతో విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రేమ వ్యవహారాల వల్లే పృథ్వీ షా ఆశించిన స్థాయిలో ఆట తీరు కనబరచడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కారణాలు ఏమిటో తెలియదు గాని.. విడిపోయేందుకు రెడీ అయ్యారు. అయితే, కొద్ది రోజుల్లోనే దీనిపై అధికారికంగా వీరిద్దరూ ప్రకటించే అవకాశం ఉంది.
ఇది పృథ్వి షా కెరియర్..
యంగ్ ప్లేయర్ పృథ్వి షా కెరియర్ పరిశీలిస్తే.. ఇప్పటి వరకు ఆరు వన్డే మ్యాచ్ లు ఆడాడు షా. ఆరు వన్డే మ్యాచ్ ల్లో 31.5 సగటుతో 189 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 49 పరుగులు. అలాగే, ఐదు టెస్టులు ఆడిన ఈ యంగ్ బ్యాటర్ 42.38 సగటుతో 339 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 134 పరుగులు. అలాగే, ఒక టి20 మ్యాచ్ ఆడిన షా కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. అదే విధంగా ఇప్పటి వరకు 71 ఐపిఎల్ మ్యాచ్ లు ఆడిన పృథ్వీ షా.. 23.86 సగటుతో 1694 పరుగులు చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 99 పరుగులు కాగా, 13 అర్థ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం షా వయసు 24 ఏళ్లు కాబట్టి.. ఈ తరహా వ్యాపకాలను పక్కన పెట్టి కెరియర్ పై దృష్టి సారిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, లేకపోతే కెరియర్ నాశనం అవుతుందని పలువురు సూచిస్తున్నారు.