PM Narendra Modi : పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై ఒలింపిక్ నిర్వాహకులు అనర్హత వేటు వేసిన సంఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. సెమీఫైనల్ లో అద్భుతమైన ప్రతిభ చూపి ఫైనల్ దూసుకెళ్లిన వినేశ్ ఫొగాట్ ను.. ఫైనల్స్ కు ఎలిజిబుల్ కాదంటూ.. ఆమె పోటీపడుతున్న విభాగంలో 100 గ్రాముల బరువు అధికంగా ఉందని ఒలింపిక్ నిర్వాహకులు ఆమెపై అనర్హత వేటు విధించారు దీంతో కోట్లాదిమంది భారతీయుల హృదయాలు ముక్కలయ్యాయి. ఫైనల్ పోరులో ఆమె గోల్డ్ మెడల్స్ సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె అనర్హతకు గురికావడంతో ఒక్కసారిగా భారత్ ఆశలు ఆడియాసలయ్యాయి..వినేశ్ ఫొగాట్ అయితే గుండెలు పగిలేలా ఏడ్చింది. 100 గ్రాముల బరువును తగ్గించుకునేందుకు ఆమె తన జుట్టును కత్తిరించుకుంది. శరీరం నుంచి కొంతమేర రక్తాన్ని తొలగించుకుంది. చివరికి అన్నం కూడా మానేసింది. రన్నింగ్ చేసింది. స్కిప్పింగ్ చేసింది. అయినప్పటికీ 100 గ్రాముల బరువు అధికంగా ఉండడంతో.. ఫైనల్స్ లో పోటీపడే అవకాశాన్ని కోల్పోయింది.
వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు విధించిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ట్విట్టర్ వేదికగా కీలకమైన ట్వీట్ చేశారు.” నువ్వు విజేతలకే విజేతవు. అని ఆట తీరు దేశానికి స్ఫూర్తిదాయకం. భారతీయులందరూ నిన్ను ప్రేరణగా తీసుకుంటున్నారు. ఈరోజు నీపై విధించిన అనర్హత వేటు చాలా ఇబ్బంది కలిగించింది. దీనిని ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ఈ వేదన నుంచి నువ్వు త్వరగా బయటపడాలి. అత్యంత బలంగా తిరిగి రావాలి. నువ్వు అలా వస్తావని నేను నమ్ముతున్నాను. ఎదురీతలను ఎదుర్కోవడం ఎలాగో నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కష్టకాలంలో నీకు మేము అండగా ఉంటామని” మోడీ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు విధించిన నేపథ్యంలో భారత ఒలింపిక సంఘం అధ్యక్షురాలు పి.టి.ఉషతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోన్ లో మాట్లాడారు..వినేశ్ ఫొగాట్ పై ఎందుకు అనర్హత వేటు విధించారు? దానికి దోహదం చేసిన పరిస్థితులపై ఆయన ఆరా తీశారు. దీనిని సవాల్ చేసేందుకు ఉన్న అవకాశాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ” వినేశ్ ఫొగాట్ కు అవకాశం లభిస్తుంది.. ఆమెకు పోటీలో ఉండేందుకు ఉపయుక్తం అనుకుంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వారిని సంప్రదించండి. జరిగే న్యాయం కోసం నిరసన వ్యక్తం చేయండి. అత్యంత సమర్థవంతంగా ప్రదర్శించండి” అంటూ మోడీ పిటి ఉషకు సూచించినట్టు తెలుస్తోంది.
50 కిలోల రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగాట్ పోటీపడిన విషయం తెలిసిందే. సెమీఫైనల్ లో ఆమె అద్భుతంగా రాణించింది. ఫైనల్ దూసుకెళ్లింది. ద్వారం రాత్రి ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. మ్యాచ్ జరిగే కంటే ముందు ఉదయం బరిలో ఉన్న క్రీడాకారిణుల బరువును తూచారు. ఇందులో ఆమె 100 గ్రాముల బరువు అదనంగా ఉండడంతో ఆమెపై ఒలింపిక్ నిర్వాహ కమిటీ అనర్హత వేటు విధించింది. దీంతో భారత జట్టుకు మెడల్ దక్కడం కష్టమైంది. వినేశ్ పై అనర్హత వేటు విధించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆమెకు సంఘీభావంగా పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో ఒలింపిక్ నిర్వాహ కమిటీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. టోర్నీ నిర్వహిస్తున్న తీరు సరిగాలేదని మండిపడుతున్నారు. ఆమె విన్నపాన్ని అంగీకరిస్తే బాగుండేదని హితవు పలుకుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Prime minister narendra modis key tweet on vinesh phogats disqualification
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com