Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi: ప్రీతి జింటా లో కంగారు.. అయ్యర్ లో భయం.. 15...

Vaibhav Suryavanshi: ప్రీతి జింటా లో కంగారు.. అయ్యర్ లో భయం.. 15 ఏళ్ల బుడ్డోడి విధ్వంసం అలా ఉంది మరి

Vaibhav Suryavanshi: ఐపీఎల్ లో ఇప్పటివరకు పంజాబ్ జట్టుకు ఓటమి అనేది లేదు. పంజాబ్ జట్టులో అయ్యర్ దూకుడు మీద ఉన్నాడు. ఢిల్లీ లాంటి జట్టు 264 పరుగుల లక్ష్యాన్ని విధించినప్పటికీ కూడా.. అయ్యర్ అత్యంత సునాయాసంగా ఆ టార్గెట్ ఫినిష్ చేశాడు. అటువంటి అయ్యర్ లో 15 సంవత్సరాల బుడ్డోడు భయం కలిగించాడు. ఇప్పుడు దాకా స్టేడియంలో చిన్న పిల్ల మాదిరిగా సందడి చేస్తున్న ప్రీతి జింటా ముఖంలో ఆందోళన కలిగించాడు. ఉన్నంతసేపు మైదానం మొత్తాన్ని తన గ్రిప్ లో ఉంచుకున్నాడు. తన పేరు మాత్రమే కలవరించే విధంగా చివరికి పంజాబ్ అభిమానులను కూడా మెస్మరైజ్ చేశాడు.

ఆ 15 సంవత్సరాల అద్భుతం పేరు వైభవ్ సూర్య వంశీ.. ఈ ఐపీఎల్ లో మరోసారి అతడు అదరగొట్టాడు. ఇటీవల హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్న అతడు.. మరోసారి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ జట్టు బౌలర్ల మీద తన ప్రతాపాన్ని చూపించాడు.. సింగిల్స్ అంటే నామోషీ అని.. డబుల్స్ అంటే ఇబ్బందిగా.. క్విజ్ త్రీ తీయాలంటే కుదరదని భావించిన అతడు.. ఫోర్ లతో సహవాసం చేశాడు. సిక్సర్లతో తాండవం చేశాడు.

పంజాబ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో వైభవ్ సూర్య వంశీ మరోసారి రెచ్చిపోయాడు. పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏ మాత్రం భయపడకుండా బ్యాటింగ్ చేశాడు.. ఉన్నంతసేపు పరుగుల ప్రవాహాన్ని అద్భుతంగా కొనసాగించాడు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా.. పంజాబ్ బౌలర్లను అత్యంత ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కేవలం 16 బంతులు మాత్రమే ఎదుర్కొన్న సూర్య వంశీ మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సహాయంతో 43 పరుగులు చేశాడు.. అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ లో అయ్యర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జైస్వాల్ తో కలిసి తొలి వికెట్ కు కేవలం 3.2 ఓవర్లలోనే 51 పరుగుల భాగస్వామ్యాన్ని సూర్య వంశీ నెలకొల్పాడు.

సూర్య వంశీ మైదానంలో ఉన్నంతసేపు పంజాబ్ ఆటగాళ్లలో విపరీతమైన ఒత్తిడి. ముఖ్యంగా కెప్టెన్ అయ్యర్ లో విపరీతమైన ఆందోళన కల్పించింది. ఏ బౌలర్ కూడా సూర్య వంశీని ఇబ్బంది పెట్టే విధంగా బంతులు వేయలేకపోవడంతో.. అతడు బ్యాట్ తో అత్యంత స్వేచ్ఛగా దూకుడుగా బ్యాటింగ్ చేశాడు.. సిక్సర్లను యదేచ్ఛగా కొట్టాడు. కాగా, అంతకుముందు బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్ జట్టు భారీగా పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి.. 222 పరుగులు చేసింది. ఓపెనర్ సిమ్రాన్ సింగ్ మరోసారి అదరగొట్టాడు. సిమ్రాన్ సింగ్ 44 బంతుల్లో 59, అయ్యర్ 30, కూపర్ కనోలి 30, చివర్లో స్టోయినీస్ 62 పరుగులు చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version