India Vs West Indies : మాతో ఆడుతున్నారు.. ఎవర్రా మీరంతా?

దీంతో ఎంతో గొప్ప చరిత్ర ఉన్న వెస్టిండీస్ ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.  అందుకే కొత్త రక్తాన్ని జట్టులో నింపిందేకు వెస్టిండీస్ టీం ఈ నిర్ణయం తీసుకుంది.

Written By: Bhaskar, Updated On : July 9, 2023 5:57 pm
Follow us on

India Vs West Indies : గతం ఎంతో ఘనం.. నేడు అత్యంత అధ్వానం.. ఈ నానుడి అచ్చు గుద్దినట్టు వెస్టిండీస్ కు  సరిపోతుంది. రెండుసార్లు క్రికెట్ వరల్డ్ కప్, ఒకసారి టి20 వరల్డ్ కప్ సాధించిన ఆ జట్టు..వరల్డ్ కప్ నకు అర్హత సాధించలేకపోవడం నిజంగా ఆశ్చర్యకరమే. ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆ జట్టు నేడు అనామకంగా మారిపోవడం బాధాకరమే. వరల్డ్ కప్ న కు అర్హత సాధించలేక పోయిన ఆ జట్టు..రెండు మ్యాచ్ ల టెస్ట్ సీరీస్ లో భాగంగా ఇండియా జట్టుతో తలపడనుంది. ఈ సీరీస్ కోసం వెస్టిండీస్ టీం మేనేజ్మెంట్ సీనియర్లకు విశ్రాంతి ఇచ్చింది. కొత్త వారికి అవకాశం ఇచ్చింది.
వారు మినహా..
టీం ఇండియా తో తలపడే జట్టులో వెస్టిండీస్ అంతా కొత్త వారికే అవకాశం ఇచ్చింది. ఇందులో బ్రాత్ వైట్, హోల్డర్, కీమర్ రోచ్ మినహా మిగిలిన వారందరూ కొత్తవాళ్ళే కావడం విశేషం. కొత్త ఆటగాళ్లలో ఎవరికీ పట్టుమని పది మ్యాచ్ లు ఆడిన అనుభవం లేదు. భారత్ తో ఆడే టెస్ట్ సీరీస్ ద్వారా మెకంజీ, అంతాంజే, అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. రఖీమ్ కార్నివాల్ కూడా ఏడాది విరామం తర్వాత ఇండియాతో ఆడే సీరీస్ లో పునరాగమనం చేయబోతున్నాడు.అయితే ఈ టెస్ట్ టీం పై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ” మాతో ఆడుతున్నారు.. రేయ్ ఎవర్రా మీరంతా” అంటూ ఓ నెటిజన్ వెస్టిండీస్ టీం ను ఉద్దేశించి కామెంట్ చేశాడు.
క్లీన్ స్వీప్ ఖాయం
టెస్ట్ సీరీస్ ను టీం ఇండియా కైవసం చేసుకోవడం ఖాయమని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య రెండు టెస్ట్ ల సీరీస్ పది రోజుల్లో కాకుండా నాలుగైదు రోజుల్లో ముగియడం ఖాయమని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం నెటిజన్లు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇదీ షెడ్యూల్
వెస్టిండీస్, ఇండియా మధ్య రెండు టెస్ట్ లు, మూడు వన్డేలు, ఐదు టీ_20 లు జరుగుతాయి. మొదటి టెస్ట్ జూలై 12 నుంచి 16 వరకు, రెండో టెస్ట్ జూలై 20 నుంచి 24 వరకు జరుగుతుంది. ఇది పూర్తయిన తర్వాత రెండు జట్ల మధ్య మూడు వన్డేలు , ఐదు టీ_20 లు జరుగుతాయి. కొంత కాలంగా సీనియర్లు విఫలం అవుతుండటంతో వారిని ఇండియా తో జరిగే సీరీస్ కు దూరం పెట్టినట్టు వెస్టిండీస్ మేనేజ్మెంట్ ప్రకటించింది. ఇక ఇటీవల జరిగిన వరల్డ్ కప్ క్వాలి ఫై మ్యాచ్ ల్లో స్కాట్లాండ్, నెదర్లాండ్ వంటి అనామక జట్ల చేతిలో ఓటమి పాలయింది. దీంతో ఎంతో గొప్ప చరిత్ర ఉన్న వెస్టిండీస్ ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.  అందుకే కొత్త రక్తాన్ని జట్టులో నింపిందేకు వెస్టిండీస్ టీం ఈ నిర్ణయం తీసుకుంది.