https://oktelugu.com/

Anand Mahindra : ఏమిటీ నైపుణ్యం.. ఈ మహిళ చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా

ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో లో ఓ మహిళ స్టాపిల్ పిన్ లతో చిన్న బొమ్మ కారును చిటికెలో తయారు చేశారు.  కారు, చక్రాలు, బానెట్, రూఫ్..ఇలా ప్రతీది స్టాపిల్ పిన్ పిన్ లతోనే ఎంతో ఓర్పుగా, నేర్పుగా చేశారు.

Written By:
  • Rocky
  • , Updated On : July 9, 2023 / 06:09 PM IST
    Follow us on

    Anand Mahindra : ఆనంద్ మహీంద్రా.. ఇండియన్ కార్పొరేట్ ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ ఎక్కడ కూడా కించిత్ గర్వం ఉండదు. 6 పదులకు దగ్గరగా ఉన్నా కుర్రాళ్ళతో సహా పోటీ పడతారు. తాతల నాటి వ్యాపారాలతో పాటు కొత్త కొత్త వ్యాపారాలలోకి ఎంటర్ అవుతున్నారు. అలాంటి ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టిివ్ గా ఉంటారు. ట్వీట్లు మాత్రమే కాదు.. సమాజంలో విభిన్న మైన వ్యక్తుల్ని పరిచయం చేస్తారు..తనకు ఏమాత్రం కొత్తగా అనిపించినా వెంటనే రీ ట్వీట్ చేస్తారు. ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన కంటెంట్, వైరల్ వీడియోల ను మొహమాటం లేకుండా షేర్ చేస్తారు.
    అభిప్రాయాలు అడుగుతారు
    ఆసక్తికరమైన కంటెంట్, వైరల్ వీడియోల ను షేర్ చేయడమే కాదు వాటిపై తన అభిప్రాయాలు చెప్పేస్తాడు. ఫాలోవర్లతో పంచుకుంటాడు. తాజాగా ఓ మహిళ స్టాపిల్ పిన్ లతో బొమ్మ కారు తయారు చేసిన వీడియోను ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో లో ఓ మహిళ స్టాపిల్ పిన్ లతో చిన్న బొమ్మ కారును చిటికెలో తయారు చేశారు.  కారు, చక్రాలు, బానెట్, రూఫ్..ఇలా ప్రతీది స్టాపిల్ పిన్ పిన్ లతోనే ఎంతో ఓర్పుగా, నేర్పుగా చేశారు.
    జాబ్ ఇవ్వడానికి రెడీ
    ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా కు నోటి వెంట మాట రాలేదు. తక్కువ నిడివి ఉన్న ఈ వీడియోను చూసి ముగ్దుడైన మహీంద్రా.. వెంటనే ఆ వీడియోను షేర్ చేశారు. ఆమె ప్రతిభని మెచ్చుకొన్నారు. అంతే కాదు తన సంస్థ లో ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోను వేలాది మంది యూజర్లు వీక్షించారు. ఆమె ప్రతిభను కీర్తిస్తూ ట్వీట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. గతంలో కూడా ఆనంద్ మహీంద్రా ఇలానే సమాజంలో ప్రతిభావంతమైన వ్యక్తుల్ని ఇలానే ట్విట్టర్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. వారికి తన వంతుగా సహాయం కూడా చేశారు.