Piyush Chawla: కొడుకు కోసం 20 కోట్లు.. పీయూష్ చావ్లా కాన్ఫిడెంట్ కు మొక్కాల్సింది..!

ఇండియన్ క్రికెట్ లో విజయవంతమైన లెగ్ స్పిన్నర్ గా పేరు సంపాదించుకున్నాడు పీయూష్ చావ్లా. పదుల సంఖ్యలో మ్యాచ్ ల్లో ఇండియా జట్టుకు ఆడాడు చావ్లా. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.

Written By: BS, Updated On : May 13, 2023 1:52 pm

Piyush Chawla

Follow us on

Piyush Chawla: పీయూష్ చావ్లా ఇండియన్ క్రికెట్ టీమ్ లో ఓ వెలుగు వెలిగిన క్రీడాకారుడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. లేటు వయసులోనూ ఘాటైన ఆటతీరుతో తన సత్తాను చాటుతున్నాడు ఈ వెటరన్ స్పిన్నర్. స్పిన్నర్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న చావ్లా తన కుమారుడు విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. తన కొడుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ బౌలర్ కాకుండా చూసుకుంటానని చావ్లా చెబుతుండడం గమనార్హం.

ఇండియన్ క్రికెట్ లో విజయవంతమైన లెగ్ స్పిన్నర్ గా పేరు సంపాదించుకున్నాడు పీయూష్ చావ్లా. పదుల సంఖ్యలో మ్యాచ్ ల్లో ఇండియా జట్టుకు ఆడాడు చావ్లా. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బౌలర్ గా కంటే బ్యాట్స్ మెన్ గా రాణించడమే క్రికెట్లో సులభమని భావిస్తున్న చావ్లా.. తన కుమారుడిని బౌలర్ గా కంటే బ్యాటర్ గానే తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. చావ్లా తన కుమారుడి విషయంలో ఆలోచిస్తున్న విషయాన్ని.. మరో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ ద్వారా పంచుకున్నాడు.

చావ్లా చెప్పిన విషయాన్ని పంచుకున్న అశ్విన్..

‘నా ఏడేళ్ల కుమారుడు ప్రతి క్రికెట్ మ్యాచ్ చూస్తాడు’ అని చావ్లా నాతో చెప్పాడు అని అశ్విన్ వెల్లడించాడు. ‘క్రికెట్ అంటే ఇష్టమనుకుంటా’ అని అన్నా. ‘ఇష్టమే కాదు ఇంట్లో అందరినీ టీవీ ముందు కూర్చోబెడతాడు. నేనేమో నువ్వు బౌలర్ కావాలని అస్సలు అనుకోవద్దు అని చెబుతా. అతడు బంతిని ముట్టుకుంటే ఆ చేతి మీద కొడతా. ఎందుకంటే అతడు బ్యాటర్ కావాలనేది నా కల. అతడికి ప్రతిరోజు శిక్షణ ఇప్పిస్తున్న. నెట్స్ లో నేనే బౌలింగ్ చేస్తా. ఇప్పుడు ఐపీఎల్ లో నేను బౌలింగ్ చేస్తున్నందుకు రూ.50 లక్షలు ఇస్తున్నారు. అతడు మంచి బ్యాటర్ గా మారితే ఓ పదేళ్లలో రూ.20 కోట్లయినా ఇస్తారు. నా కొడుకు కోసం ఓ రూ.20 కోట్లు పక్కన పెట్టుకోవాలని ముంబై ఇండియన్స్ కు చెప్పా’ అని పీయూష్ తెలిపినట్లు అశ్విన్ వివరించాడు. ఈ విషయాన్ని యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ అశ్విన్ పంచుకున్నాడు.

బౌలర్ గా ఇబ్బందులు తెలుసు కాబట్టే..

క్రికెట్ లో బ్యాటర్ గా కంటే బౌలర్ గా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. బౌలర్ గా రాణించడం చాలా ఇబ్బందులతో కూడిన వ్యవహారం. కాబట్టే చాలామంది బౌలర్లు తమ వారసులను బ్యాటర్లుగా తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. క్రికెట్ లో వస్తున్న మార్పులు బౌలర్లు కంటే బ్యాటర్లకే అనుకూలంగా ఉంటున్నాయి. దీంతో క్రికెట్ లో మంచి పేరు గాంచిన బౌలర్లు తమ పిల్లలను భవిష్యత్తులో మంచి బ్యాటర్లుగా తీర్చిదిద్దే పనిలో ఉన్నారు. ఐపిఎల్ వంటి మెగా టోర్నీలో బౌలర్లు కంటే బ్యాటర్లకే ఎక్కువ మొత్తాలను ఇచ్చి కొనుగోలు చేస్తున్నాయి. ఏ విధంగా చూసినా బ్యాటర్లకే బౌలర్ల కంటే ఎక్కువ లాభం ఉంటోంది కాబట్టే తమ పిల్లలను బ్యాటర్లుగా చేయాలని పలువురు సీనియర్ క్రికెటర్లు భావిస్తున్నారు.