Ravichandran Ashwin : ద్రవిడ్, రోహిత్ లనే అంటారా? కడిగిపారేసిన అశ్విన్

రెండో వన్డేలో భారత్‌ ఓడిపోయిన వెంటనే సోషల్‌ మీడియాలో కొందరు సీనియర్లు ఎందుకు ఆడలేదని విమర్శిస్తున్నారని ఇది ఎందుకో అర్థం కాలేదన్నారు. మొదటి వన్డేలో కూడా రోహిత్‌ లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేశాడని గుర్తు చేశాడు.

Written By: NARESH, Updated On : August 2, 2023 9:39 pm
Follow us on

Ravichandran Ashwin : వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్న టీమిండియా సారథి రోహిత్‌శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ లక్ష్యంగా చేస్తున్న విమర్శలకు జట్టు స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గట్టి కౌంటర్‌ ఇచ్చాడు. ఈమేరకు తన యూట్యూబ్‌ చానెల్‌లో ఓ వీడియో పోస్టు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలను బెంచ్‌ చేయాలనే మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు. కపిల్‌ లాంటి మాజీ క్రికెటర్‌ కూడా మేనేజ్‌మెంట్‌ నిర్ణయాన్ని తపుప పట్టారు. ఈ నేపథ్యంలో విమర్శలకు కౌంటర్‌ ఇచ్చాడు అశ్విన్‌. వన్డే సిరీస్‌లో రోహిత్, కోహ్లీ లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందారని అనడం సరికాదన్నారు. ఈ క్రమంలో రోహిత్, కోహ్లీకి మద్దతుగా నిలిచాడు. ఈ సమయంలో జట్టుకు పరిస్థితిని అర్థం చేసుకోకుండా కొంతమంది కెప్టెన్‌–కోచ్‌ ద్వయాన్ని నిందించడానికి కారణాలను వెతకడాన్ని తప్పు పట్టారు.

ఓడితే విమర్శలా..
రెండో వన్డేలో భారత్‌ ఓడిపోయిన వెంటనే సోషల్‌ మీడియాలో కొందరు సీనియర్లు ఎందుకు ఆడలేదని విమర్శిస్తున్నారని ఇది ఎందుకో అర్థం కాలేదన్నారు. మొదటి వన్డేలో కూడా రోహిత్‌ లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేశాడని గుర్తు చేశాడు. అభిమానులు ప్రతీసారి ఇద్దరే గెలిపిస్తారని భావిస్తున్నారని తెలిపాడు. వరల్డ్‌ కప్‌ అర్హత మ్యాచ్‌లో ఓడిపోవడంతో కలత చెంది అలా మాట్లాడి ఉంటారని పేర్కొన్నారు.

వరల్డ్‌ కప్‌ గెలవడమే లక్ష్యం..
అంతర్జాతీయ క్రికెట్‌లో భారతదేశం ఏకైక పని ప్రపంచకప్‌ గెలవడం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు. తాము కూడా అదే అనుకుంటున్నామని, టీమిండియానే ఫేవరెట్‌ అనుకుంటున్నామని తెలిపాడు. జస్ప్రీత్‌ బుమ్రా తిరిగి జట్టులోకి రావడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, శ్రేయస్‌ అయ్యర్, రిషబ్‌ పంత్, కేఎల్‌.రాహుల్‌ జట్టులోకి రావడానికి కష్టపడుతున్నారన్నారు. వారి కోసమే రోహిత్, కోహ్లికి విశ్రాంతి ఇచ్చినట్లు తెలిపారు. చాలా మంది ఆటగాళ్లు కూడా గాయాల నుంచి కోలుకుంటున్నారన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత బుమ్రా తిరిగి వచ్చాడని, ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా జట్టులో చేరాడని పేర్కొన్నాడు. గాయాల సమస్యలను అర్థం చేసుకోకుండా రాహుల్‌ ద్రవిడ్, రోహిత్‌ శర్మను విమర్శించడాన్ని తప్పు పట్టారు.