PBKS vs RCB : వృద్ధులు ఇదే వేదికపై జరిగిన మ్యాచ్లో రజత్ సేన విజయం సాధించగా.. క్వాలిఫైయర్ -1 లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది. టాస్ గెలిచిన దగ్గరనుంచి మొదలుపెడితే మ్యాచ్ ముగిసే వరకు.. ప్రతి అంశం బెంగళూరుకు కలిసి వచ్చింది.. పంజాబ్ ఇన్నింగ్స్ సమయంలో బెంగళూరు బౌలర్లు దుమ్మురేపారు. సుయాస్ శర్మ, హేజిల్ వుడ్ చెరి మూడు వికెట్లు సాధించారు. యష్ దయాళ్ రెండు వికెట్లు పడగొట్టాడు.. పంజాబ్ జట్టులో స్టోయినీస్ 26 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. కీలకమైన ప్రభ్ సిమ్రాన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, శశాంక్ సింగ్, జోస్ ఇంగ్లిస్, నెహల్ వదెరా వంటి వారు దారుణంగా విఫలమయ్యారు. దీంతో పంజాబ్ జట్టు 20 ఓవర్లు కూడా పూర్తిస్థాయిలో ఆడలేకపోయింది. కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలిపోయింది.
102 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఆడుతూ పాడుతూ చేదించింది. పది ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. బెంగళూరు బ్యాటర్లలో సాల్ట్ 56 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అతడు మైదానంలో విధ్వంసాన్ని సృష్టించాడు. పంజాబ్ బౌలర్ల బౌలింగ్ ను ఉప్పు పాతర వేశాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో ముల్లాన్ పూర్ మైదానాన్ని హోరెత్తించాడు. విరాట్ కోహ్లీ 12, మయాంక్ అగర్వాల్ 19 పరుగులకే వెను తిరిగినప్పటికీ.. కెప్టెన్ రజత్ పాటిధార్ 15 పరుగులు చేసి.. లక్ష్యాన్ని సులువుగా బెంగళూరు సులువుగా చేదించేలా చేశాడు. ఈ విజయం ద్వారా తొమ్మిది సంవత్సరాల అనంతరం బెంగళూరు ఐపిఎల్ ఫైనల్ వెళ్ళింది. ఇక జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్లో ట్రోఫీ కోసం ప్రత్యర్థి జట్టుతో తలపడుతుంది. బెంగళూరు జట్టు విజయం సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక సోషల్ మీడియాలో అయితే విన్నర్ బెంగళూరు అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతున్నది.