PBKS Vs MI Qualifier 2 Rain Threat: ఇక ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ జట్టు ఊహించని స్థాయిలో ఓటమి ఎదుర్కొంది.. దీంతో గుజరాత్ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయి.. ఇంటికి వెళ్ళిపోయింది.. అంతకుముందే పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లు విజయం సాధించి బెంగళూరు ఫైనల్ వెళ్లిపోయింది. ఇక గుజరాత్ పై గెలిచిన ముంబై క్వాలిఫైయర్ -2 మ్యాచ్లో పంజాబ్ తో తలపడేందుకు రెడీ అయింది. మొత్తంగా పంజాబ్, ముంబై జట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగుతుందని అర్థమవుతోంది. ఒకవేళ అనుకోకుండా మ్యాచ్ రద్దయితే.. ఫైనల్ వెళ్లే జట్టు ఏది అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే క్వాలిఫైయర్ -2 మ్యాచ్ కు రిజర్వ్ డే ఉన్నప్పటికీ.. ఆరోజు కూడా వర్షం కురిస్తే పరిస్థితి ఏందనే ప్రశ్న వ్యక్తమవుతోంది..
Also Read: ముంబైకి అచ్చిరాని అహ్మదాబాద్..ఈ రోజు జరిగే మ్యాచ్లో గెలుస్తుందా?
ఇక ప్రస్తుత ఐపీఎల్ లో వర్షం వల్ల అనేక మ్యాచ్లు రద్దు అయ్యాయి. ఒకవేళ ఇప్పుడు వర్షం కురిసి క్వాలిఫైయర్ -2 మ్యాచ్ కనుక రద్దు అయితే లాభం దక్కించుకునే జట్టు ఏదనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమవుతోంది. ఒకవేళ రిజర్వుడే రోజు కూడా మ్యాచ్ రద్దు అయితే.. అప్పుడు మంచి ర్యాంకింగ్ లో ఉన్న జట్టు ఫైనల్ లో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ కనక రద్దు అయితే పంజాబ్ జట్టు నేరుగా ప్రయోజనం పొందుతుంది. ఎందుకంటే పంజాబ్ జట్టు ఖాతాలో అత్యధికంగా 19 పాయింట్లు ఉన్నాయి. అందువల్లే ఆ జట్టు టాప్ -1 లో ఉంది. ఒకవేళ గనుక అనుకోకుండా క్వాలిఫైయర్-2 మ్యాచ్ రద్దు అయితే పంజాబ్ నేరుగా ఫైనల్ వెళ్తుంది. జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్లో కన్నడ జట్టుతో తలపడుతుంది. ఇక క్వాలిఫైయర్ -1 లో పంజాబ్ జట్టును మట్టి కరిపించి.. కన్నడ జట్టు ఫైనల్ వెళ్ళిపోయింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం క్వాలిఫైయర్ -2 మ్యాచ్ రద్దు అవడానికి అవకాశం లేదు. ఆదివారం అహ్మదాబాద్ లో వర్షం కురిసే అవకాశం లేదు. ఒకవేళ మ్యాచ్ మధ్యలో అంతా వర్షం కురిస్తే.. మళ్లీ అక్కడి నుంచే మొదలవుతుంది.
అహ్మదాబాద్ మైదానంలో అత్యంత ఆధునికమైన డ్రైనేజీ వ్యవస్థ ఉంది. ఈ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా వాననీరు వెంటనే బయటికి వెళుతుంది. పిచ్ ను వెంటనే ఆటకు సిద్ధం చేయడానికి అవకాశం కలుగుతుంది. అందువల్ల వర్షం కురిసిన కూడా మ్యాచ్ ఎక్కడైతే ఆగిపోతుందో.. అక్కడినుంచి తిరిగి ప్రారంభించడానికి అవకాశం ఉంటుందని ఐపీఎల్ నిర్వాహకులు చెబుతున్నారు. అంతేకాదు పిచ్ ను ఆరబెట్టడానికి అహ్మదాబాద్ మైదానాల్లో అత్యంత ఆధునిక యంత్రాలు ఉన్నాయని.. వర్షం కురిసి కాస్త తెరిపిస్తే మైదానాన్ని సిద్ధం చేయడం పెద్ద విషయం కాదని వారు అంటున్నారు.